Home » ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమా రివ్వ్యూ…అల్లు శిరీష్ హిట్ కొట్టాడా..?

ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమా రివ్వ్యూ…అల్లు శిరీష్ హిట్ కొట్టాడా..?

by AJAY
Ad

Urvasivo Rakshasivo Review in Telugu: aఅల్లు శిరీష్ అను ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో. ఈ సినిమాకు మొదట ప్రేమంటే కాదంటా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కానీ ఆ తర్వాత సినిమా టైటిల్ ను మార్చేశారు. ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహించారు. సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది కానీ కానీ కారణాల వల్ల విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. భారీ అంచనాల‌ నడుమ ఈ చిత్రాన్ని నవంబర్ 4వ తేదీన నేడు విడుదల చేశారు. మ‌రి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఇప్పుడు చూద్దాం..

ఊర్వ‌శివో రాక్ష‌సివో” సినిమా రివ్వ్యూ

Advertisement

Urvasivo Rakshasivo Review  Storyసినిమా కథ :

ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే హీరో అదే కంపెనీలో హీరోయిన్ ను ఇష్టపడతాడు. ఇద్ద‌రి మధ్య స్నేహం రిలేషన్ షిప్ కు దారితీస్తుంది. ఆ తర్వాత ఇద్దరు శారీరకంగా కూడా కలుస్తారు. కొంత కాలం పాటు సహజీవనం చేస్తారు. హీరో హీరోయిన్ ను ఎంతగానో ఇష్టపడతాడు. కానీ హీరోయిన్ మాత్రం ఈ రోజుల్లో ఇదంతా కామన్ అంటూ లైట్ తీసుకుంటుంది. కానీ హీరో మాత్రం హీరోయిన్ ను విడిచిపెట్టలేకపోతాడు. మరి చివరికి హీరో ..హీరోయిన్ ప్రేమను పొందుతాడా..? ఇద్దరు పెళ్లి చేసుకుంటారా..? అసలేం జరిగింది అన్నదే ఈ సినిమా కథ.

Advertisement

Urvasivo Rakshasivo Review in Telugu సినిమా ఎలా ఉందంటే :

ఇప్పటి జనరేషన్ ఎలా ఉంది అనేది ఈ సినిమాలో చూపించారు. కాబట్టి యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఐటి రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ సినిమా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. నేటితరం యూత్ ఆలోచనలను సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. అయితే సినిమా లెంత్ మాత్రం కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. దాంతో కొన్నిసార్లు బోర్ కొట్టినట్టు కూడా ప్రేక్షకులు ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో అల్లు శిరీష్ డీసెంట్ రోల్ లో కనిపించాడు. గతంలో అల్లు శిరీష్ నటనకు విమర్శలు ఎదుర్కొనేవారు. కానీ ఈ సినిమాలో నటన కాస్త ఇంప్రూవ్ అయినట్టు కనిపించింది. అను ఇమ్మానుయేల్ కనిపించినంతసేపు ప్రేక్షకులకు బోర్ కొట్టదు. హాట్ బ్యూటీ తన గ్లామర్ తో ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేసింది. ఇక సినిమాలో సునీల్, వెన్నెల కిషోర్ కామెడీని పండించే ప్రయత్నం చేశారు. సినిమా కథ కథనం రొటీన్ గానే ఉన్నాయి కాకపోతే టైం పాస్ అవుతుంది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. మ్యూజిక్ మాత్రం అంతంత మాత్రం గానే ఉంది. సినిమా లెంత్ ఎక్కువగా ఉండడం.. పాటలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, బిజిఎం ఈ సినిమాకు కాస్త మైనస్ గా నిలిచాయి. ఒక్క‌మాటలో చెప్పాలంటే ఈ సినిమాను ఒకసారి థియేటర్లలో చూడవచ్చు.

Also Read: కాంతార సినిమా కంటే ముందే తెలుగు సినిమాలో నటించిన రిషబ్ శెట్టి.. అది ఏ సినిమాలో తెలుసా ?

Visitors Are Also Reading