దేశంలో చాలా మంది పిల్లలు పోషకాహారలోపంతా బాధపడుతున్నారని చాలా సర్వేలు చెబుతున్నాయి. నితి అయోగ్ కూడా దేశంలో పిల్లలు పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారని పేర్కొంది. పోషకాహారలోపానికి ముఖ్య కారణం పేదరికం..ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు హాస్టళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్డు మరియు అరటిపండ్లను ఆహారంగా ఇస్తున్నాయి. నిజానికి చాలా మంది పిల్లలకు కడుపునింపుకోవడానికే బడికి వస్తుంటారు. ఇదిలా ఉండగా కర్నాటకలోని ఏడు జిల్లాల్లో పోషకాహారలోపం ఉందని ఓ సర్వే చెప్పింది.
దాంతో గత నెలలో కర్నాటక ప్రభుత్వం కూడా బడుల్లో గుడ్లు మరియు అరటి పండ్లను భోజనంలో భాగంగా విద్యార్థులకు అందించాలని నిర్ణయం తీసుకుంది. కానీ కర్నాటకలోని లింగాయత్..బ్రాహ్మణ మఠాధిపతులు స్కూళ్లలో గుడ్లు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేఖించారు. స్కూల్లలో పిల్లకు గుడ్లు తినిపించడం సమాజానికి మంచిది కాదు…స్కూళ్లు ఉన్నది పాఠాలు చెప్పడానికి కానీ గుడ్లు తినిపించడానికి కాదు అంటూ ప్రజావర్ మఠానికి చెందిన ఓ స్వామీజీ అన్నారు. మరో స్వామీజీ గుడ్డు పెడితే స్కూళ్లు మిలటరీ క్యాంపులు అవుతాయంటూ మరో స్వామీజీ వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement
ALSO READ : పెళ్లిమండపంలోకి గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ చేసిన జంట..కానీ క్రేన్ అడ్డంతిరగటంతో….!
దాంతో గుడ్డు పెట్టాలన్న ఆలోచనను విరమించుకోవాలని నిర్ణయం తీసుకునే ఆలోచన చేసింది కర్నాటక ప్రభుత్వం. దాంతో కర్నాటకలోని కొప్పాల్ జిల్లాకు చెందిన గంగావతి అనే బాలిక మఠాధిపతులను కడిగి పారేసింది. మీరు తనకుంటే తినకండి మాకు గుడ్డూ కావాలి..అరటి పండు కూడా కావాలి..మీరు గుడ్డు తనకూడదు అని గొడవ చేస్తే మీ మఠంలో వచ్చి తింటాం. అసలే మావి పేద కుటుంబాలు, మేం పోషకాహారలోపంతో బాధపడుతున్నాం…అంటూ గంగావతి యుద్దమే చేసింది. దాంతో గంగావతి మటాధిపలతును కడిగిపారేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ బాలికకు నెటిజన్లు చప్పట్లు కొడుతున్నారు.