అలనాటి నటి జయసుధ అంటే తెలియని వారు ఉండరు.300కు పైగా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. మద్రాసులో పుట్టి పెరిగిన జయసుధ తన అత్తమ్మ విజయనిర్మలను ఆదర్శంగా తీసుకొని సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. విజయనిర్మల అసలు పేరు సుజాత.. అయితే ఈ నటి “పండంటి కాపురం” సినిమాలో మొదటిసారిగా చేసింది. ఆ తర్వాత శోభన్ బాబు హీరోగా మెయిన్ లీడ్ లో నటించినా జయసుధ కెరీర్ లోనే వెనక్కి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ కన్నడ, హిందీ చిత్రాలు దాదాపుగా 400 సినిమాల్లో నటించింది. అప్పటి టాప్ తెలుగు హీరోయిన్లలో జయసుధ ఒకరిగా ఉండేవారు అంటే ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
also read:వేదిక ఒకటే.. రవీంద్రనాథ్ ఠాగూర్ రెండు గీతాలు.. ఆసక్తికర ఘటన ఎక్కడంటే..?
Advertisement
Advertisement
అలనాటి అగ్ర హీరోలు అందరితో కలిసి నటించిన జయసుధ తన కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే ఒక వ్యక్తితో లవ్ లో పడింది. ఆ ప్రేమే ఆమె కెరియర్ ను చాలా ఇబ్బంది పెట్టింది. అయితే చాలామంది జయసుధ భర్త కేవలం నితిన్ కపూర్ అనే అనుకుంటారు. కానీ నితిన్ కపూర్ కంటే ముందు మరో వ్యక్తితో పెళ్లి జరిగింది. ఆమె మొదటి భర్త కాకర్లపూడి రాజేంద్రప్రసాద్. ఒక సినిమా షూటింగ్ సమయంలో రాజేంద్రప్రసాద్ తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో వీరు ఎవరికి తెలియకుండా రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఇక చివరికి కుటుంబ సభ్యులు చేసేదేంలేక విజయవాడలోని మొగల్ రాజాపురం మధు కళ్యాణ మండపంలో మళ్లీ వివాహం చేశారు.
వివాహానికి రామానాయుడు అప్పటి జడ్జ్ నాదెండ్ల శ్రీనివాస్, విపి రామచంద్రన్, మురళీమోహన్ వంటి ప్రముఖులు వచ్చి ఆశీర్వదించారు. వీరి పెళ్లి గురించి అప్పట్లో వార్తాపత్రికల్లో కూడా మెయిన్ హెడ్ లైన్ లో వార్తలు వచ్చాయి. వందలాది మంది అభిమానులు కూడా వచ్చారు. వీరు ఎంత తొందరపడి పెళ్లి చేసుకున్నారో అంతే తొందరగా కూడా విడిపోయారు. ఆ తర్వాత జయసుధ నటనలో కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలోని నితిన్ కపూర్ తో పరిచయం ఏర్పడింది. మళ్లీ ప్రేమ పుట్టింది. పెళ్లి కూడా చకచకా జరిగిపోయింది. ఆ తర్వాత నితిన్ తో విభేదాలు రావడంతో అతడు ముంబైలో ఉంటే ఈమె హైదరాబాదులో ఉండేది.
also read;Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆచితూచి అడుగేయాలి