Home » నటుడు చంద్రశేఖర్ భార్య కూడా ఫేమస్ యాక్టర్.. ఆమె ఎవరంటే..?

నటుడు చంద్రశేఖర్ భార్య కూడా ఫేమస్ యాక్టర్.. ఆమె ఎవరంటే..?

by Sravanthi
Ad

దర్శక దీరుడు జక్కన్న సినిమాల్లో ఎక్కువగా కనిపించే నటుల్లో చంద్రశేఖర్ కూడా ఒకరు. ఆయన చేసే ఏ పాత్ర అయినా పూర్తి న్యాయం చేయగల సత్తా కలిగిన నటుడు. అందుకే రాజమౌళి తన సినిమాలో చంద్రశేఖర్ కు అవకాశాలు ఇస్తూ ఉంటారు. అలాగే ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన చత్రపతి సినిమాలో భద్ర పాత్ర పోషించారు.

Advertisement

also read:ఓకే యాడ్ లో చిరంజీవి, బాలయ్య.. ఎవరు బాగా చేశారో మీరే చూడండి..!!

బాహుబలి సినిమాలో తప్ప రాజమౌళి అన్ని సినిమాల్లో చంద్రశేఖర్ నటించారు. రాజమౌళి మొదటి చిత్రమైన స్టూడెంట్ నెంబర్ వన్, అలాగే చంద్రశేఖర్ కూడా ఇదే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టారు. చంద్రశేఖర్ రాజమౌళి సినిమాలే కాకుండా ఇంకా అనేక సినిమాల్లో నటించి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సాధించారు. అలాంటి చంద్రశేఖర్ భార్య గురించి చాలామందికి తెలియదు. ఆయన భార్య పేరు భవాని, ఈమె కూడా సినిమాలో యాక్టర్ కావడం విశేషం.

Advertisement

తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాకు చెందిన భవానిని సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందే ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కెరియర్ లో స్థిరపడాలనే ఉద్దేశంతో ఇద్దరు సినిమా అవకాశాల కోసం ట్రై చేశారు. ఈమె సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సాధించింది. పండగ చేస్కో , కిట్టు, జెంటిల్మెన్ వంటి చాలా సినిమాల్లో కూడా నటించింది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో వివిధ కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. వీరికి ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు. ఈమె తెలుగుతో పాటుగా తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది.

also read:

Visitors Are Also Reading