ప్రస్తుతం ప్రపంచ దేశాలలో మార్మోగిపోతున్న పేరు రిషి సునక్.. అగ్రరాజ్యమైన బ్రిటన్‌లో ఈయన పేరు మారుమోగి పోవడం, తొలి భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడిగా రిషి సునక్ చరిత్రను తిరగ రాశాడని చెప్పవచ్చు.. అలాంటి ఆయనకు భారత దేశంతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఆయన ఇష్టాయిష్టాలు, ఆస్తులు, కుటుంబం, ఎవరికి తెలియని 10 విషయాలు తెలుసుకుందాం..
#1.పార్లమెంట్లో భగవద్గీతపై యార్క్‌షైర్ ఎంపీగా రిషి ప్రమాణం చేశారు. బ్రిటన్‌లో అలా చేసిన మొదటి పార్లమెంటేరియన్.
Advertisement
#2. రిషి తల్లిదండ్రులిద్దరూ భారత సంతతికి చెందినవారు. తల్లిదండ్రులు, ఫార్మసిస్ట్‌లు, 1960లలో తూర్పు ఆఫ్రికా నుండి UKకి వలస వెళ్లారు. సునక్ తండ్రి యశ్వీర్ సునక్ నేషనల్ హెల్త్ సర్వీస్ జనరల్ ప్రాక్టీషనర్, తల్లి ఉషా సునక్ కెమిస్ట్ షాప్ నడుపుతున్నారు.
#3.రిషి సునక్ ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కూతుర్లు కృష్ణ, అనౌష్క.
also read:కృతిశెట్టి హీరోయిన్ అవ్వడం కోసం ఆమె తల్లి చేసిన త్యాగం గురించి వింటే ఆశ్చర్యపోతారు..!
Advertisement
#4. రిషి సునాక్ కు ఇండియా అన్న, ఇక్కడి సాంప్రదాయాలు అన్న చాలా గౌరవం. అందుకే దీపావళి సహా అన్ని పండుగలను సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాల గురించి తల్లిదండ్రులు తనకు చెబుతుండేవారని కొన్ని సందర్భాల్లో ఆయన గుర్తు చేశారు.
#5.రిషి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, పూర్తి చేశారు. మాజీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా సేవలందించారు.
#6.రిషి సునక్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి తన అత్తమామలను కలవడానికి తరచుగా బెంగుళూరుకు వస్తు ఉంటారు.
#7.ఈ ఏడాది వేసవిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా, రిషి సునక్ తన విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన సూట్లు, బూట్లు, ఇతర అంశాలలో విమర్శలను ఎదుర్కొన్నాడు. ఒత్తిడికి గురి అయినప్పుడు భగవద్గీత చదివి ఒత్తిడి తగ్గించుకుంటారని రిషి చెప్పడం గొప్ప విషయం.
#8.రిషి సునక్ నికర విలువ 700 మిలియన్ పౌండ్లకు పైగా ఉంది. UKలో చాలా ఆస్తులు కలిగి ఉన్నారట. యార్క్‌షైర్‌లో ఒక ఇల్లు ఉండటమే కాకుండా, అతని భార్య అక్షత సెంట్రల్ లండన్‌లోని కెన్సింగ్టన్లో ఆస్తులు కలిగి ఉన్నారట.
#9.ఫిట్‌గా ఉండటానికి, రిషి సునక్ క్రికెట్ ఆడతారట.
also read: