Ad
గత ఏడాది టీ20 ప్రపన్ఛ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన ఇండియాను .. ఈ ఏడాది కూడా పాక్ ఓ సారి ఓడించింది. ఆసియా కప్ లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్ లలో ఓ మ్యాచ్ లో ఇండియా పాక్ పై ఓడిపోయింది. అందుకే ఈరోజు పాకిస్థాన్ తో ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ పై చాలా ఆయేషాలు అనేవి పెట్టుకున్నారు ఫ్యాన్స్.
అయితే ఈ మ్యాచ్ లో 160 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టు వారి ఆశగలను నిరాశగా మార్చేసింది అనిపించింది. కానీ విరాట్ కోహ్లీ క్రీజులో ఉండటంతో చివరి వరకు ఆశలు అనేవి వదులుకోలేదు ఫ్యాన్స్. ఇక కోహ్లీ కూడా వారి ఆశలను నిలబెడుతూ.. 53 బంతుల్లో 82 పరుగులు చేసి ఇండియాను గెలిపించాడు.
ఇక ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ తో విరాట్ అద్భుతమైన రికార్డు అనేది అందుకున్నాడు. ఈ 82 పరుగులతో అంతర్జాతీయ టీ20 ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఏ మ్యాచ్ ముందు వరకు ఆ స్థానంలో 3,741 పరుగులతో రోహిత్ శర్మ ముందు ఉండగా.. విరాట్ కోహ్లీ ఇప్పుడు 3,773 పరుగులతో మొదటి స్థానానికి వచ్చేసాడు. అయితే కోహ్లీ ఈ పరుగులు అనేవి కేవలం 110 ఇన్నింగ్స్ లలో మాత్రమే సాధించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
దేనికైనా సిద్ధం అంటున్న ఇండియా, పాక్ కెప్టెన్లు..!
ఇండియా చీటింగ్ చేసిందా..?
Advertisement