Home » ఇండియా చీటింగ్ చేసిందా..?

ఇండియా చీటింగ్ చేసిందా..?

by Azhar
Ad

ఇండియా, పాకిస్థాన్ మధ్య ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో మ్యాచ్ అనేది జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా నరాలు తెగే ఉత్కంఠ మధ్య విజయం అనేది సాధించింది. కానీ గెలుపు కోసం ఇండియా చీటింగ్ చేసింది అని అంటున్నారు. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది.

Advertisement

ఇక లక్ష్య ఛేదనలో మొదట తడబడిన ఇండియా.. చివర్లో ఊపు అందుకుంది. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసాడు. అయితే ఈ మ్యాచ్ చివరి ఓవర్ లో మూడో బంతి అనేది పాక్ బౌలర్ నవాజ్ క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ నడుము కంటే ఎత్తులో వేసాడు. అందువల్ల అంపైర్ దానిని నో బాల్ గా ప్రకటించాడు. కానీ అది నో బాల్ కాదు అని పాకిస్థాన్ ఫ్యాన్స్ అంటున్నారు.

Advertisement

అయితే క్రికెట్ నియమాల ప్రకారం బంతిని ఎదర్కొనే బ్యాటర్ నడుము కంటే బంతి అనేది ఎత్తులో వస్తే దానిని నో బాల్ గా ఇస్తారు. ఇక ఇక్కడ కూడా అదే రూల్ ప్రకారం నో బాల్ ఇచ్చిన పాకిస్థాన్ ఫ్యాన్స్ దానిని చీటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దానికి కౌంటర్ గా భారత ఫ్యాన్స్ కూడా.. దానికి సంబంధించిన ఫొటోలో లైన్ గీస్తూ.. కళ్ళు పెదవి చేసు చూసుకోండి అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

దేనికైనా సిద్ధం అంటున్న ఇండియా, పాక్ కెప్టెన్లు..!

స్లో ఓవర్ రేట్ నివారణకు కొత్త ప్లాన్..!

Visitors Are Also Reading