Ad
రేపు ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అనేది జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక గత ప్రపంచ కప్ లో పాకిస్థాన్ చేతిలో ఓడిన ఇండియా ఎలాగైనా గెలవాలని ప్లాన్ చేస్తుంటే.. మళ్ళీ అదే సీన్ ను రిపీట్ చేయాలనీ పాకిస్థాన్ భావిస్తుంది.
ఇక ఈ మ్యాచ్ కోసమే ఆటగాళ్లు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. ఆ క్రమంలో బీసీసీఐ సెక్రెటరీ జై షా చేసిన కామెంట్స్ మొత్తం అట్రాక్షన్ తమ వైపు తిప్పుకున్నాయి. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరిగే ఆసియా కప్ లో ఇండియా పాల్గొనదు.. ఆ సిరీస్ ను వేరే వేదిక పైనే నిర్వహించాలని ఆయన తెలిపారు. ఇక ఇప్పుడు రెండు దేశాలలో ఈ విషయం పైనే చర్చ అనేది సాగుతుంది.
అయితే తాజాగా ఆసీస్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ కూడా ఈ ప్రశ్న అనేది ఎదురైంది. దానిపైన తన వెర్షన్ అనేది చెప్పిన రోహిత్.. పాకిస్థాన్ కు వెళ్లడం పైన తనకు ఏం తెలియదు అని.. ఆ విషయాలు బీసీసీఐ చూసుకుంటుంది అని తెలిపారు. ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం రేపు పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ పైనే ఉందని.. అందులో ఎలా గెలవాలి అనేది ఆలోచిస్తున్నం అని రోహిత్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్ లో ఎవరంటే..?
మా చేతిలో లేదు.. ప్రభుత్వం చేతిలో ఉంది..!
Advertisement