Home » చిరంజీవితో చెప్పులు కుట్టించిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?

చిరంజీవితో చెప్పులు కుట్టించిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?

by Sravanthi
Ad

అలనాడు ఇండస్ట్రీలో డైరెక్టర్ మరియు నటుడిగా తనదైన శైలిలో పేరు తెచ్చుకున్న వ్యక్తి కె.విశ్వనాథ్.. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఎంతటి ఆదరాభిమానాలు పొందాయో మనందరికీ తెలుసు. ఇందులో చిరంజీవి హీరోగా వచ్చిన మూవీ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మధ్యతరహా హీరోల్లో చిరంజీవి తన స్వయంకృషితో ఇండస్ట్రీలో ఎదిగారు.. అయితే కె.విశ్వనాథ్ కూడా స్వయంకృషి సినిమా కథకు తగ్గట్టుగా హీరో కావాలని వెళుతున్నారు. అది కూడా స్వయంకృషితో ఎదిగిన హీరో అయితే బాగుంటుందని చిరంజీవిని అడిగారు. దీంతో ఆయన ఈ సినిమాకు ఓకే చెప్పారు. అప్పటికే చిరు ఇండస్ట్రీలో సుప్రీం హీరో గా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

Advertisement

also read:రామానాయుడు చివ‌రి కోరిక ఏంటో తెలుసా..? అది వెంక‌టేష్ తీరుస్తాడా ?

Advertisement

అప్పటికే చిరంజీవి సినిమా అంటే ఫైట్స్, స్టంట్స్,డాన్స్ తప్పనిసరిగా ఉంటాయని అభిమానులు ఆశించే సమయం. ఆ సమయంలోనే చిరంజీవి తో చెప్పులు కుట్టే పాత్ర అంటే, ఫ్యాన్స్ ఒప్పుకుంటారో లేదో అని విశ్వనాథ్ గారికి అనుమానం. అలాంటి పాత్ర చేస్తారో లేదో కానీ మంచితనానికి మారుపేరు ఉన్న చిరంజీవి మాత్రం ఈ సినిమాను చేస్తానని అన్నారు. ఇక ఇంకేం కావాలి విశ్వనాథ్ ఏ హీరోని పెట్టాలి అనుకున్నారో, సరిగ్గా అలాంటి హీరోనే ఒప్పుకోవడంతో కథను హాస్య బ్రహ్మ జంధ్యాల చేతికి ఇచ్చేసారు. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా సాధారణమైన వ్యక్తిలా చెప్పులు కుట్టుకుంటూ, రేడియోలో పాటలు వింటూ, చనిపోయిన తన చెల్లి కొడుకుని పెంచుకుంటూ, ఒక పెద్ద చెప్పుల షాప్ పెట్టుకోవాలని కలలు కనే ఒక సాధారణ మనిషిగా కథ మొదలవుతుంది. ఈ పాత్రలో చిరంజీవి నిబద్ధత, క్రమశిక్షణని విశ్వనాధ్ చాలా బాగా తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి పాత్ర పేరు సాంబయ్య. సినిమా ప్రారంభంలోనే తాను చెప్పులు కుట్టుకుంటూ డబ్బులు లెక్క పెడుతూ చిన్నగా కలలోకి జారుకుంటాడు.

ఆయన ఒక పెద్ద షాప్ పెట్టినట్టు, ఆ షాపులోని చెప్పులను అమ్ముతున్నట్టు ఊహించుకుంటాడు. ఈ ఒక్క షాట్ లోనే విశ్వనాధ్ గారు ఏం చెప్పాలనుకున్నారో అది సామాన్య ప్రజలకు హత్తుకునేలా చెప్పేసారు. ఈ సినిమాకు మరో అద్భుతమైన పాత్ర విజయశాంతి, ఇద్దరి మధ్య ప్రేమ ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం సినిమాను మరింత హైలెట్ గా చేసింది. ఇలా ఎన్నో సన్నివేశాల మధ్య మనిషి యొక్క ఆదర్శ ప్రయాణాన్ని చూపించిన మూవీ స్వయంకృషి. హీరో కంటే చిరంజీవి లో నటుడిని ఆవిష్కరించిన మూవీ ఇది. ఈ సినిమా చిరంజీవి కి నంది అవార్డును కూడా తెచ్చిపెట్టింది.

also read:

Visitors Are Also Reading