Home » రామానాయుడు చివ‌రి కోరిక ఏంటో తెలుసా..? అది వెంక‌టేష్ తీరుస్తాడా ?

రామానాయుడు చివ‌రి కోరిక ఏంటో తెలుసా..? అది వెంక‌టేష్ తీరుస్తాడా ?

by Anji
Ad

టాలీవుడ్ దివంగ‌త నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గురించి సినీ ఇండస్ట్రీలో తెలియని వారుండరు. ఆయన ఒక నిర్మాత మాత్రమే కాదు మంచి నటుడు కూడా. ప్ర‌స్తుతం అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన‌టువంటి సురేష్ బాబు, హీరో విక్టరీ వెంకటేష్ కు తండ్రి. సురేష్ ప్రొడక్షన్ అధినేత కూడా. అయితే, ఆయన చివరి కోరిక తీర్చలేదని విక్టరీ వెంకటేష్ నేటికీ తలుచుకుంటూ బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ తర్వాత అక్కినేని ఫ్యామిలీ, రామానాయుడు ఫ్యామిలీలు చాలా పెద్దవి అనే చెప్ప‌వ‌చ్చు.

Also Read : స‌మంత బాటలోనే ప్రియ‌మ‌ణి..? భ‌ర్త‌తో విడాకుల దిశ‌గా అడుగులు..!

Advertisement

అక్కినేని నాగేశ్వర రావు గారు తన కుమారుడు నాగార్జునకు నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మిని ఇచ్చి వివాహం జరిపించారు. కుటుంబాల మధ్య బంధం ఏర్పడింది. అయితే, నాగ చైతన్య పుట్టిన త‌రువాత నాగార్జున తన మొదటి భార్య లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వాస్తవానికి రామానాయుడు కుటుంబంతో బంధం తెంచుకోవాలని నాగేశ్వరరావుకు అస్సలు ఇష్టం లేదు. అందుకే లక్ష్మికి విడాకులు ఇవ్వొద్దని కొడుకుతో వారించాడని ఇండస్ట్రీలో కొంతకాలం నడిచింది.

Advertisement

Also read : శ్రీ‌కాంత్ గురించి సీనియ‌ర్ హీరోయిన్ లైలా ఏమందో తెలుసా ?

తండ్రి మాట వినకుండా నాగ్ రెండో పెళ్లి చేసుకున్నాక కొంతకాలానికి రామానాయుడు కూడా తన కూతురుకి రెండో పెళ్ళి జరిపించి విదేశాలకు పంపించాడు.ఇక తన చెల్లెను మోసం చేశాడని విక్టరీ వెంకటేష్ తన భావ నాగార్జున మీద కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రామానాయుడు చివరి రోజుల్లో పాత పగలు పక్కనపెట్టి నాగార్జునతో కలిసి మెలిసి ఉండాలని.. ఇద్దరు కలిసి సినిమాలు చేయాలని పలుమార్లు ప్రస్తావన తీసుకొచ్చాడ‌ట‌. అయినా కానీ వెంకటేష్ మాత్రం దానికి ససేమిరా ఒప్పుకోలేదట‌. తన సోదరుని మోసం చేసిన వాడితో సినిమాలు చేయనని వెంకీ చెప్పడంతో రామానాయుడు చాలా బాధపడ్డారని తెలిసింది. ఇక కొంతకాలానికి ఆయన మరణించాడు. కానీ వెంకీ మాత్రం తన తండ్రి కోరికలను తీర్చలేదని అప్పుడప్పుడు గుర్తుచేసుకొని బాధపడుతుంటారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

Also Read : ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా.. జ‌పాన్‌లో కూడా..!

 

Visitors Are Also Reading