Home » ఉదయం బ్రేక్ ఫాస్ట్ వదిలేస్తే మీరు ఆ ప్రమాదంలో పడ్డట్టే.. జాగ్రత్త..!

ఉదయం బ్రేక్ ఫాస్ట్ వదిలేస్తే మీరు ఆ ప్రమాదంలో పడ్డట్టే.. జాగ్రత్త..!

by Anji
Ad

సాధారణంగా చాలా మంది ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం వేళ అసలు బ్రేక్ పాస్ట్ సరిగ్గా చేయరు. నేటి సమాజంలో ఎక్కువగా ఉద్యోగులు ఉదయం సమయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా అలాగే ఉండిపోతున్నారు. మరి కొంతమంది ఎక్కువగా బరువు పెరుగుతుండడం వల్ల బ్రేక్ ఫాస్ట్ ని తినకుండా వదిలేస్తున్నారు. డైటింగ్ చేసేవారు చాలామంది తక్కువ తినడం లాంటి పనులు కూడా చేస్తున్నారు. ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Also Read : చలికాలంలో పిల్లలకు ఇలాంటి ఆహారాలు ఇవ్వటం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు..!

Advertisement

ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల తలనొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మైగ్రేన్ సమస్య కూడా రావచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఇలా తినకపోవడం వల్ల ఆ వ్యక్తి ఎక్కువగా ఆందోళన చెందే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను నిద్రలేచిన వెంటనే సమయం చూసుకొని తింటే బెటర్.

Advertisement

Also Read :  భార్య ఈ 3 రహస్యాలను భర్తకు అస్సలు తెలియనివ్వదు..ఇందులో 1 చాలా ఇంపార్టెంట్..!!

రాత్రి భోజనానికి మధ్యాహ్నం భోజనానికి మధ్య ఎక్కువగా సమయం తీసుకోవడం వల్ల మానసిక మానవ శరీరంలో కాల్షియం లోపం వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే హిమోగ్లోబిన్ లోపం కూడా రావచ్చు అని చెబుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం తీసుకునే ఫలహారం అస్సలు వదలకుండా తినాలి. బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య కూడా కలుగుతుంది. బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల ఆరోగ్యానికి చెడు చేసే విధంగా బరువు కూడా తగ్గే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్పారు. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ ని ప్రతి రోజు ఉదయం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తినడం మంచిది.

Also Read : స‌రికొత్త ఆలోచ‌న‌.. వాట‌ర్ బాటిల్‌తో ఇలా అద్భుతం..!

 

Visitors Are Also Reading