బిగ్ బాస్ సీజన్- 5 ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ లో మొత్తం 19 మంది సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా వారిలో చివరి కంటెస్టెంట్ గా కాజల్ ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ లో కాజల్ ఇన్ని రోజులు ఉండడానికి కారణం జెస్సీ నే అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. జెస్సీ అనారోగ్యం కారణంగా బయటకు వచ్చిన వారం ఓటింగ్ ను బట్టి చూస్తే కాజల్ ఎలిమినేట్ అవ్వాల్సి ఉందని కానీ ఆ వారం జెస్సీ బయటకు రావడంతో ఎలిమినేషన్ నుంచి కాజల్ తప్పించుకుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Advertisement
ఇక ఆ వారం మానస్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ మానస్ కంటే కాజల్ కు తక్కువ ఓటింగ్ నమోదయిందని తెలిపారు. అంతే కాకుండా 12వ వారం రవి ఎలిమినేట్ కాగా ఆ వారం కూడా కాజల్ ఇంటి నుండి వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ 12వ వారం కూడా కాజల్ సేఫ్ అయ్యింది. ఇక బిగ్ బాస్ టాప్ 6 వరకు ఉన్న కాజల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. అయితే ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న టాక్ ప్రకారంగా కాజల్ 14 వారాల పాటు హౌస్ లో ఉండగా వారానికి రూ.2 లక్షల చొప్పున పుచ్చుకున్నట్టు తెలుస్తోంది.
Advertisement
కాజల్ 14 వారాలకు దాదాపు 28 నుండి 30 లక్షల వరకు తీసుకుందని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ లో ఉన్న సమయంలో తనకు అప్పులు ఉన్నాయని చెప్పిన కాజల్ ఇప్పుడు రెమ్యునరేషణ్ తీసుకుని అప్పు తీర్చుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కాజల్ రేడియో జాకీగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆర్ జే కాజల్ అంటూ తన గొంతుతో రేడియో రంగంలో తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా టీవీ రంగంలోనూ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.