Home » రాజమౌళి, కోడి రామకృష్ణ చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అని తెలుసా..?

రాజమౌళి, కోడి రామకృష్ణ చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అని తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి స్థానం ప్రత్యేకం.. ఆయన ఇండస్ట్రీలోనే ఫ్లాప్ లేని డైరెక్టర్ గా పేరు పొందారు.. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో రాజమౌళి డైరెక్షన్ ఫీల్డ్ లోకి వచ్చారు..

అప్పట్లో ఈ మూవీకి నాలుగు కోట్లు పెడితే దాదాపుగా 12 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత మగధీర, ఈగ,లాంటి విజువల్ వండర్ చిత్రాలు చూపించి తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటాడు..

also read:మహానటి సావిత్రి స్టార్ హీరోయిన్ రేఖకు ఏమవుతుందో తెలుసా…?

ఆయన డైరెక్షన్ చూసి ఇండియా సినీరంగం మొత్తం గర్విస్తోంది. ఇప్పటివరకు దర్శకుడిగా ఒక్క ఓటమి కూడా లేని ధీరుడు.. అలాంటిది జక్కన్న కెరియర్లో ఒక సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.. వి.యన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన” రెయిన్ బో” సినిమాలో రాజమౌళి మరియు కోడి రామకృష్ణ నటించారు. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందని వి.ఎన్.ఆదిత్య ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.. రాజమౌళి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని సాధించాయి.

బాహుబలి బిగినింగ్ చిత్రాన్ని 138 కోట్లతో నిర్మిస్తే 191 కోట్లకు అమ్మారు. మొత్తం కలెక్షన్స్ 302 కోట్లు వచ్చాయట. ఇక బాహుబలి కంక్లూజన్ 250 కోట్లతో నిర్మిస్తే 1617 కోట్లు వసూలు చేసింది.. ఇటీవల రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాని 350 కోట్ల పెట్టుబడి పెడితే 1200 వసూలు చేసి చరిత్ర క్రియేట్ చేసింది.

also read:

Visitors Are Also Reading