ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అష్టకష్టాలు పడి ఇండస్ట్రీలోనే స్టార్ నటుడిగా, అభిమానుల దేవుడిగా మారిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అలనాటి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు.. ఆయన సినీ జీవితంలో ఇంతటి ఆదరాభిమానాల వెనుక ఐదు సినిమాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
#1. అడవి రాముడు :
తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమాకు ముందు అత్యధిక కలెక్షన్లు కోటి రూపాయలు మించేది కాదు. కానీ అడవి రాముడు సినిమా మాత్రం ఏకంగా ఏడాదిలో నాలుగు కోట్ల రూపాయలు సంపాదించి చరిత్ర క్రియేట్ చేసింది. ఈ సినిమా ద్వారానే ఎన్టీఆర్ అగ్ర నటుడిగా పేరు పొందారు.
#2. వేటగాడు :
Advertisement
కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా, శ్రీదేవి హీరోయిన్ గా వచ్చిన ఈ మూవీ వేటగాడు. ఇందులో “ఆకు చాటు పిల్ల తడిచే” పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ మూవీతో ఆయన పారితోషికం పది లక్షలకు చేరుకుంది.
Advertisement
also read:జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి గురించి వల్లభనేని వంశీ ఏమన్నారంటే ?
#3. సర్దార్ పాపారాయుడు:
దాసరి నారాయణరావు దర్శకత్వంలో క్రాంతి కుమార్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో అద్భుత విజయం సాధించింది. పాపారాయుడు పాత్రలో ఎన్టీఆర్ నటన వేరే లెవెల్.
#4. కొండవీటి సింహం:
రాఘవేంద్రరావు డైరెక్షన్ లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ నటన హైలెట్ గా నిలిచింది. ఇందులో ఎన్టీఆర్ కుమారుడిగా మోహన్ బాబు నటన అద్భుతం. అప్పట్లో ఈ మూవీ సూపర్ హిట్ అయింది.
#5. బొబ్బిలి పులి
దక్షిణ భారతదేశంలోనే తొలిసారి 70 ప్రింట్లతో వందకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
also read: