Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » జూనియ‌ర్ ఎన్టీఆర్ పెళ్లి గురించి వ‌ల్ల‌భ‌నేని వంశీ ఏమ‌న్నారంటే ?

జూనియ‌ర్ ఎన్టీఆర్ పెళ్లి గురించి వ‌ల్ల‌భ‌నేని వంశీ ఏమ‌న్నారంటే ?

by Anji
Ads

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల‌కు పెళ్లి జరగడానికి చంద్రబాబు కారణమని చాలామంది భావిస్తుంటారు. లక్ష్మిప్రణతి అన్యోన్యంగా ఉండటంతో పాటు టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒక జోడిగా జోడి ఉందనే సంగతి తెలిసిందే. అయితే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలలో ఒకరైన వల్లభనేని వంశీ మోహన్ జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి విషయంలో కూడా ఎవరి పాత్ర లేదని కామెంట్లు చేశారు. చంద్రబాబును ఉద్దేశించి ఆయన ఈ మాటలు అన్నారు. ఎన్టీఆర్‌కి అమరావతికి సంబంధం ఏంటి అని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. అమరావతి రైతులను పొలాలు ఇవ్వాల‌ని తారక్ ఏమైనా అడిగారా అంటూ వల్లభనేని వంశీ కామెంట్లు చేయడం గమనార్హం.

Advertisement

Ad

ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ గురించి అమరావతి రైతులు కొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విమర్శల గురించి వల్లభనేని వంశీ స్పందిస్తూ ఈ కామెంట్లు చేయడం గమనార్హం. తన గురించి ఎన్ని నెగిటివ్ కామెంట్లు వస్తున్నా తారక్ మాత్రం ఆ కామెంట్లను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విమర్శల గురించి స్పందించడం వల్ల అనవసర వివాదాలకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని ఎన్టీఆర్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్లు తారక్ అభిమానులను సైతం ఒకింత హార్ట్ చేశాయనే సంగతి తెలిసిందే.

Advertisement

Also Read :  చిరంజీవి రాష్ట్ర ఆస్తి.. అస్స‌లు క్ష‌మించనంటున్న వ‌ర్మ‌..!

తారక్ కొత్త సినిమాకు సంబంధించి సెట్ వర్క్స్ త్వరలో ప్రారంభం కానున్నాయని బోగట్టా. దీపావళి పండుగ కానుకగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ రానున్న‌ట్టు స‌మాచారం. దర్శకుడు కొరటాల శివ తన సినీ కెరీర్ లో ఏ సినిమా కోసం కష్టపడని స్థాయిలో ఈ సినిమా కోసం కష్టపడ్డారట‌. ఈ సినిమా పూర్తైన తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కే సినిమాతో బిజీ కానున్నారు.

Also Read :  పెళ్ళికి ముందు అల్లు రామలింగయ్య చిరంజీవిని సీక్రెట్ గా ఒక కంట కనిపెట్టేవారట ఎందుకంటే ?

 

Visitors Are Also Reading