ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఈ లెవెల్ లో కొనసాగుతుంది అంటే దాని వెనుక ఎన్టీఆర్ కృషి చాలా వరకు ఉంది. ఆయన సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగారో మనందరికీ తెలుసు. ఆయన ఇండస్ట్రీలో చేయని పాత్ర అంటూ లేదు.. అప్పట్లో ఎన్టీఆర్ ను ఒక దేవుడిలా కొలిచేవారు. సినిమాల్లో ఏ విధంగా చరిత్ర సృష్టించారో, ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కూడా ఆ విధంగానే చరిత్ర సృష్టించారు.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కొనసాగుతున్న సమయంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ కి చెమటలు పట్టించాడు..
Advertisement
ALSO READ:నారా బ్రాహ్మణి, బాలకృష్ణ కోసం ఇప్పటికీ ఆ పని చేస్తుందట..!!
Advertisement
సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా ఉన్న ఎన్టీఆర్, రాజకీయాల్లోకి రావడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి కారణమట.. ఆమె ఎవరు, ఎందుకు వచ్చారు అనే వివరాలు చూద్దాం.. అది కాంగ్రెస్ పాలన సమయం.. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం పూటకో సీఎం మారుతున్న సందర్భం.. ఆ సందర్భంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం ఎన్టీఆర్ తో ఇలా మాట్లాడిందంట.. మీరు ప్రజల్లో పేరు మర్యాదలు ఉన్న వ్యక్తి. కోట్లాదిమంది ప్రజలు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు.. నమ్ముతున్నారు.. అలాంటి పేద ప్రజల కోసం మీరు రాజకీయాల్లోకి వెళితే బాగుంటుందని సలహా ఇచ్చారట.. దీంతో NTR ఆలోచనలో పడ్డారు.. సర్దార్ పాపారాయుడు షూటింగ్ లో ఉన్న టైంలో కొంత మంది సన్నిహితులు నీకు 60 సంవత్సరాలు నిండుతున్నాయి..
ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా అని అడగడంతో 15 రోజులు ప్రజాసేవ చేయాలను కుంటున్నాం అని చెప్పారు ఎన్టీఆర్.. అలా ఎన్టీఆర్ 1982 march 28న టిడిపి పార్టీని స్థాపించారు. స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సీఎం అయ్యారు.. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి పేదల దేవుడయ్యాడు.. కానీ ఆయన చివరి రోజుల్లో ఎన్నో అవమానాలు భరించి చివరికి కన్నుమూసారు..
ALSO READ: