ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బ్రహ్మానందం.. ఆలీ..వీరు కమెడియన్స్ గా ఎన్నో సినిమాల్లో చేశారు.. అదేవిధంగా బ్రహ్మానందం మరియు కోవై సరళ కాంబోలో వచ్చిన కామెడీ అంటే మరో లెవెల్ లో ఉంటుంది. ఈ జంట తెరమీద కనిపిస్తే నవ్వలేక చచ్చే వారే.. ఒకరికంటే ఒకరు ఎక్కువగా పోటీపడి నవ్విస్తూ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వారు. “క్షేమంగా వెళ్లి లాభంగా రండి” సినిమాలో ఈ జంట కామెడీ మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో వీరిద్దరు పాపులర్ కమెడియన్స్ గా మారిపోయారు.
Advertisement
also read:Big boss 6: అర్ధరాత్రి ఆర్ జె సూర్య, ఇనయ.. ఛీ..ఛీ.. అందులో రెచ్చిపోయారుగా..!
Advertisement
వీరిద్దరు కలిసి వందల చిత్రాల్లో నటించారు. మరి అలాంటి కోవై సరళ కామెడీ పాత్రలే కాకుండా కథానాయికగా కూడా చేసిందని చాలా మందికి తెలియదు.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. కోవై సరళ తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో ఎం.జి.ఆర్ సినిమాలు చూసి నటనపై ఆసక్తి పెంచుకుంది. తొమ్మిదో తరగతిలో ఉండగానే విజయ్ కుమార్,కె.ఆర్.విజయ సరసన “వెళ్లిరథం” తమిళ సినిమాలో మొట్ట మొదటిసారిగా నటించింది. ఆ తర్వాత “చిన్నవీడు” అనే మూవీలో నటించింది.
ఇలా క్యారెక్టర్ పాత్రలతో దూసుకుపోతున్న కోవై సరళ టాలెంట్ గుర్తించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ తను హీరోగా చేసిన “సతీలీలావతి” చిత్రంలో ఆయన సరసన హీరోయిన్ గా తీసుకున్నారు. 1993 లో విడుదలైన ఈ చిత్రంలో సరల నటన అద్భుతం.. కామెడీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో నటించి పురస్కారాలు కూడా అందుకుంది.
also read: