Home » నెల‌కు రూ.700 జీతం కోసం సూర్య అలాంటి ప‌నులు చేసేవాడా..? సినిమాల్లోకి ఎలా వ‌చ్చాడంటే…?

నెల‌కు రూ.700 జీతం కోసం సూర్య అలాంటి ప‌నులు చేసేవాడా..? సినిమాల్లోకి ఎలా వ‌చ్చాడంటే…?

by AJAY
Ad

చాలా మంది హీరోలు త‌మ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరో స్టేట‌స్ ను అందుకుంటారు. కానీ ఇత‌ర ఇండ‌స్ట్రీల‌లోనూ అభిమానుల‌ను సంపాదించుకునే హీరోలు అతికొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి హీరోల లిస్ట్ లో సూర్య కూడా ఒక‌రు. నిజానికి సూర్య త‌మిళ హీరో అయినప్ప‌టికీ తెలుగులో సూర్య‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. సూర్య హీరోగా న‌టించిన గ‌జిని సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

hero-surya-and-karthik-images-with-family

Advertisement

 

ఇక మొద‌టి సినిమాతోనే సూర్య తెలుగులోనూ చాలా మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. సూర్య హీరోగా న‌టించిన సెవ‌న్త్ సెన్స్ సినిమా కూడా తెలుగులో సూప‌ర్ హిట్ అయ్యింది. రీసెంట్ గా జై భీం సినిమాతో సూర్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.  సినిమా ఓటీటీ లో విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అదేవిధంగా సూర్య న‌టించిన ఆకాశ‌మే నీ హ‌ద్దురా సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది.

Advertisement

ఇలా చెప్పుకుంటూ పోతే సూర్య కెరీర్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. సూర్య‌తో పాటూ త‌య‌న తమ్ముడు కార్తీ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. అయితే కార్తీకి సూర్య రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ లేక‌పోయినా తెలుగులోనూ మంచి గుర్తింపు సాధించాడు. అదే విధంగా సూర్య స‌తీమ‌ణి జ్యోతిక కూడా ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా రానించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం స్టార్ హీరోగా ల‌క్ష‌ల్లో అభిమానుల‌ను సంపాదించుకున్న సూర్య మొద‌ట ఓ ఉద్యోగం చేసేవాడు.

సూర్య తండ్రి శివ‌కుమార్ కూడా న‌టుడు అయినప్ప‌టికీ ఆస్తులు ఉన్న‌ప్ప‌టికీ సూర్య త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డాల‌ని అనుకున్నాడట‌. అంతే కాకుండా తండ్రి బాట‌లో న‌డ‌వ‌కూడ‌ద‌ని అనుకున్నాడట‌. ఈ నేప‌థ్యంలోనే సూర్య మొద‌ట ఓ గార్మెంట్ ఫ్యాక్ట‌రీలో నెల‌కు కేవ‌లం రూ.736 రూపాయ‌ల‌కు ప‌నిచేసేవాడ‌ట‌. ఆ త‌ర‌వాత త‌న తండ్రి చివ‌రికోరిక మేర‌కు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Read Also : 

చాలా మందికి లైఫ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్.. అనాథ ఆశ్రమంలో చేరడానికి కారణం ఏంటో తెలుసా ?

ఆదిపురుష్ మూవీపై ఆశ్చర్యకర కామెంట్స్ చేసిన అలనాటి రాముడు.. నేను అంగీకరించను అంటూ ?

Visitors Are Also Reading