Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం

by Anji

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 04.10.2022: మేషం

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. కొన్ని సంద‌ర్భాల్లో ప‌క్క వారిని క‌లుపుకొని పోతే ప‌నులు త్వ‌ర‌గా పూర్త‌వుతాయి. పెద్ద‌ల మ‌నోభావాల‌కు త‌గ్గ‌ట్టుగా ప్ర‌వ‌ర్తించ‌డం మేలైన ఫ‌లితాన్ని ఇస్తుంది. ప్ర‌యాణాలు సిద్ధిస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

మ‌ధ్య‌మ ఫ‌లితాలుంటాయి. ప‌క్క వారిని క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌గ్గుతాయి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ చాలా అవ‌స‌రం. దూర ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu: మిథునం

కుటుంబ స‌భ్యుల‌తో ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థిక ఫ‌లితాలు అనుకూలంగా ఉంటాయి. స‌కాలంలో బుద్ధిబ‌లం బాగా ప‌ని చేస్తుంది. ఒక విష‌యంలో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. తోటివారితో క‌లిసి శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

అనుకూల ఫ‌లితాలు సిద్ధిస్తాయి. అవ‌రానికి స‌హాయం చేసేవారు ఉన్నారు. ఒక శుభ‌వార్త మీ మ‌నో విశ్వాసాన్ని పెంచుతుంది. కీల‌క విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Today rashi phalau in telugu : కన్య

అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం మంచిది. కీల‌క విష‌యాల‌లో ఆత్మీయుల స‌ల‌హాలు మేలు చేస్తాయి. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల ఆత్మాభిమానం దెబ్బ‌తింటుంది. వివాదాల‌కు పోరాదు.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు పెరుగుతాయి. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న కాస్త బాధ క‌లిగిస్తుంది. మీకు రావాల్సిన అవ‌కాశాలు రాక‌పోవ‌డం, ప‌క్క వాళ్ల‌కు రావ‌డంతో కాస్త నిరుత్సాహం క‌లుగుతుంది. కుటుంబంలో కొద్దిపాటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కోపాన్ని కాస్త త‌గ్గించుకుంటే మంచిది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మంచి ఫ‌లితాలు ఉన్నాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో అధికారులు దృష్టిని మీరు ఆక‌ర్షిస్తారు. ఓ వ్య‌వ‌హారంలో మెరుగైన ఫ‌లితాల‌ను పొందుతారు. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆయా రంగాల్లో తోటివారి స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి. బంధు మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. మీ బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందుతారు. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మంచి ఫ‌లితాలు సిద్ధిస్తాయి. బంధు మిత్రుల‌ను క‌లుస్తారు. కొన్ని కీల‌క వ్య‌వ‌హారాల‌ను వారితో చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకుంటారు. అధికారుల స‌హ‌కారం ఉంటుంది.

Today rashi phalau in telugu : కుంభం

అనుకున్న ప‌నులు పూర్తి అవుతాయి. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. బంధువుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

చేప‌ట్టే ప‌నుల్లో అనుకూల‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. నూత‌న వ‌స్తువుల‌ను కొంటారు. మీ అధికార ప‌రిధి పెరుగుతుంది. మొహ‌మాటాన్ని ద‌రిచేర‌నీయ‌కండి. బంధువుల‌తో వైర సూచ‌న‌. ప్ర‌యాణాల్లో ముందు జాగ్ర‌త్తలు తీసుకోవాలి.

Visitors Are Also Reading