Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వివాదాల‌కు దూరంగా ఉండ‌డం మంచిది

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వివాదాల‌కు దూరంగా ఉండ‌డం మంచిది

by Anji
Ad

రాశి ఫ‌లాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 02.10.2022 నుండి 08.10.2022 వరకు

మేషం :

Mesha

Mesha

మంచి ఆలోచ‌న విధానంతో అనుకున్న ప‌నుల‌ను పూర్తి చేశారు. వ్యాపార బ‌లం అద్బుతం. తిరుగులేని శ‌క్తిగా ఎదుగుతారు. ఇంట్లో వారి సూచ‌న‌లు అవ‌స‌రం. మిత్రుల వ‌ల్ల ఒక విజ‌యం సాధిస్తారు. వివాదాల‌కు దూరంగా ఉండాలి. సంతృప్తినిచ్చే వార్త వింటారు.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

ఉద్యోగంలో శ్ర‌మ ఫ‌లిస్తుంది. స్వ‌యంకృషితో పైకి వ‌స్తారు. ఇత‌రుల‌పై అస‌లు ఆధార‌ప‌డ‌వ‌ద్దు. వ్య‌క్తి గ‌త విష‌యాల్లో అభివృద్ధి సూచితం. ధ‌న లాభం ఉంది. ఆనందంగా ఖ‌ర్చు చేస్తారు. బంధు, మిత్రుల అభినంద‌న‌లు ఉంటాయి. స‌మిష్టి కృషితో సంక‌ల్పం సిద్ధిస్తుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

మంచి కాలం న‌డుస్తోంది. ప‌నులు త్వ‌ర‌గా పూర్త‌వుతాయి. మ‌నోబ‌లం విశేషం ఉంటుంది. అధికార యోగం సూచితం. వ్యాపారంలో క‌లిసొస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణ‌యం ధ‌న లాభాన్ని ఇస్తుంది. స్థిర‌బుద్ధితో ప్ర‌శాంతంగా ఆలోచించండి. ఒత్తిడి ఉంటుంది. గృహ వాహ‌న యోగాలున్నాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వ‌హించాలి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఇప్పుడు చేసే ప‌ని మంచి ఫ‌లితాన్ని ఇస్తుంది. మ‌న‌సు పెట్టి ప‌ని చేయండి. ఉద్యోగంలో బాగుంటుంది. అధికార యోగం ఉంటుంది. గొప్ప కీర్తిని పొందుతారు. గృహ‌, భూ వాహ‌నాది యోగాల‌కు అనుకూల‌మైన కాలం. సుఖ‌, సంతోషాలు ఉంటాయి. అద్భుతమైన వ్యాపార లాభం ఉంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

Advertisement

వ్యాపార యోగం బ్ర‌హ్మాండం. విశేష ధ‌న‌లాభం సూచితం. త‌గు మాన‌వ ప్ర‌య‌త్నం చేయాలి. ఎవ‌రి మాట‌లు ప‌ట్టించుకోవ‌ద్దు. ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అపార్థాల‌కు అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్దు.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

మంచి ఆలోచ‌న‌ల‌తో ప‌ని ప్రారంభించండి. మీ ల‌క్ష్యం నెర‌వేరుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా ప‌నులు స‌మ‌ర్థ‌వంతంగా పూర్తి చేస్తారు. కీల‌క వ్య‌వ‌హారాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. విఘ్నాలు ఉన్నాయి. అడుగ‌డుగునా అడ్డు త‌గిలే వారు ఉంటారు. ఆలోచించి అడుగేయాలి. వ్యాపారంలో లాభం ఉంటుంది.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ముఖ్య కార్యాల్లో శ్ర‌ద్ధ వ‌హించాలి. కాలం వ్య‌తిరేకంగా ఉంది. పొర‌పాటున జ‌రుగ‌కుండా ప్ర‌తీ ప‌ని ఆలోచించి చేయాలి. నిరాశ‌ప‌రిచే ప‌రిస్థితులుంటాయి. ధైర్యంగా ప‌ని చేయండి. చెడు ఆలోచ‌న‌లు రానివ్వ‌కూడ‌దు. ఒంట‌రిగా ఏ ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్దు. ఇంట్లో వారి స‌ల‌హా త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉత్త‌మ కాలం ఇది. శుభ ఫ‌లితం సొంత‌మవుతుంది. ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. మంచి ప‌నులు చేసి విశేష లాభాలు అందుకోవాలి. గొప్ప భ‌విష్య‌త్ ల‌భిస్తుంది. అర్హ‌త‌ల‌ను పెంచుకుంటూ స‌మాజంలో పేరు సంపాదించుకోవాలి. బంధు, మిత్రుల ఆద‌ర‌ణ ఉంటుంది. ఇంట్లో శుభ‌కార్యాలు జ‌రుగుతాయి.

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మ‌వుతుంది. ఆశ‌యం నెర‌వేరుతుంది. అద్భుత‌మైన శుభ‌యోగం ఉంటుంది. అన్నింటిలో క‌లిసి వ‌స్తుంది. ఉద్యోగంలో ఉన్న‌త స్థితి సూచితం. కోరుకున్న జీవితం ల‌భిస్తుంది. ఆలోచ‌న‌లు మంచి మార్గం న‌డిపిస్తాయి. స‌మిష్టి నిర్ణ‌యాలు మంచి భ‌విష్య‌త్‌ను ఇస్తాయి. వ్యాపార రిత్యా శ్ర‌మ ఉంటుంది.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

విశేషమైన కృషితో ల‌క్ష్యాన్ని చేరాలి. ఉద్యోగంలో శ్ర‌మ ఉంటుంది. అధికారుల‌తో సౌమ్యంగా సంభాషించండి. పొర‌పాటు అధికారుల‌తో సౌమ్యంగా సంభాషించండి. పొర‌పాటు జ‌రుగ‌నివ్వ‌వ‌ద్దు. వారం మ‌ధ్య‌లో విజ‌యం ల‌భిస్తుంది. ఆవేశ ప‌రిచే వారుంటారు. ధైర్యం కోల్పోవ‌ద్దు. స‌మిష్టి కృషితో లాభం ఉంటుంది.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

అద్భుత‌మైన శుభ‌యోగం ఉంది. త‌గిన ప్ర‌య‌త్నం చేయండి. అనుకున్న స్థితికి చేరుతారు. ఉద్యోగంలో మంచి జ‌రుగుతుంది. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా పూర్తి చేస్తారు. ఉత్త‌మ కాలం న‌డుస్తోంది. స‌ద్వినియోగం చేసుకోవాలి. ఆప‌ద‌లు తొలిగిపోతాయి. వారం మ‌ధ్య‌లో ముఖ్య‌మైన ప‌ని పూర్తి అవుతుంది.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

ఏకాగ్ర‌త‌తో ప‌ని ప్రారంభించండి. మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. అంతా మ మంచికే అన్న‌ట్టుగా ఆలోచించాలి. తొంద‌ర‌వ‌ద్దు. విఘ్నాల‌ను తెలివిగా అధిగ‌మించాలి. ఎవ‌రితోనూ త‌ర్కించ‌వ‌ద్దు. మిత్రుల సూచ‌న‌లు ప‌ని చేస్తాయి. న‌మ్మ‌కం గెలిపిస్తుంది. ఖ‌ర్చులు పెరుగ‌కుండా చూసుకోవాలి. ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది.

 

Visitors Are Also Reading