Home » హిజ్రాలు ఎవరిని పెళ్లి చేసుకుంటారో తెలుసా..? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

హిజ్రాలు ఎవరిని పెళ్లి చేసుకుంటారో తెలుసా..? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi
Ad

మనం ప్రతిరోజు బయటకు వెళ్ళినప్పుడు బస్టాండ్ లో, రైల్వే స్టేషన్లలో, ఇతరాత్ర మార్కెట్లలో అనేక మంది హిజ్రాలు తారసపడతారు.. అలా వారిని చూసినప్పుడు చాలా మంది ఈసడించుకుంటారు. అసహ్యించుకుంటారు.. వారిని చూడగానే దూరంగా వెళ్తారు.. అలా హిజ్రాలను కనీసం మన తోటి మనుషుల్లాగా కూడా భావించారు.. అలాంటి హిజ్రాల లో చాలా తెలివైనవారు ఉన్నారు. చదువుకున్న వారు, ఉద్యోగం చేసేవారు, వ్యాపారాలు చేసేవారు కూడా ఉన్నారు. అన్నీ ఉన్నా వారు కొంతమంది పెట్టే హింసలు మౌనంగా భరిస్తూ ఉంటారు.. హిజ్రాలు చాలా మంది గుంపులు గుంపులుగా జీవిస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం వీరు సమాజంలో గుర్తింపు లేకపోవడం.

Advertisement

also read:నిత్యం ఈ 5 ర‌కాల పండ్ల‌ను తీసుకుంటే మీ కొవ్వు క‌రిగిపోవ‌డం ప‌క్కా..!

Advertisement

అలాంటి మంచి మనసున్న హిజ్రాల గురించి మీకు తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం.. ప్రతి రోజూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే హిజ్రాలు సంవత్సరంలో ఆ మూడు రోజులు మాత్రం చాలా ఆనందంగా గడుపుతారు.. అదే హిజ్రాల పండగ. ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం. కానీ హిజ్రాలకు అది తీరని కోరికగా మిగిలిపోతుందనీ అనుకోవడం మన పొరపాటే. హిజ్రాలు కూడా పెళ్లి చేసుకుంటారు. వీరి పెళ్లి కోసం పెద్ద ఉత్సవం జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న విల్లుపురం జిల్లాలో ఉలుండూర్ పేట తాలూకా లోనీ కువంగా గ్రామంలో ఉన్న తాండవరు ఆలయమే హిజ్రాల పవిత్ర ఆలయం. వారు ఈ ఆలయంలోని ఆరాధ్య దైవాన్ని వివాహం చేసుకుంటారు.

కురుక్షేత్రంలో పాండవుల గెలవాలంటే ఒక గొప్ప యోధున్ని బలి ఇవ్వాలి. అలాంటి యోధుడు అర్జునుడు అని గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ అర్జునుణ్ణి బలి ఇవ్వడం ఇష్టంలేక, అర్జునుడికి నాగ కన్య కులుపికి జన్మించిన ఐరావంతుడు గుర్తుకు వచ్చి బలిదానానికి ఒప్పిస్తాడు. కానీ బలి అయ్యే ముందు పెళ్లి చేయాలని షరతు పెడతాడు ఐరవంతుడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని మోహిని రూపంలో పెళ్లి చేసుకుంటాడు. ఇక అప్పటి నుంచి మోహిని భర్త అయిన ఐరవంతుడు తన భర్త అని చెప్పుకుంటారు హిజ్రాలు. ఐరవంతుడు, మోహినిలా సూచనగా ప్రతి సంవత్సరం హిజ్రాలు ఇలా పెళ్లి చేసుకుంటారు.

also read:

Visitors Are Also Reading