Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ధ‌న లాభం క‌లుగుతుంది

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ధ‌న లాభం క‌లుగుతుంది

by Anji
Ad

రాశి ఫ‌లాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 25.09.2022 నుండి 01.10.2022 వరకు

మేషం :

Mesha

Mesha

ముఖ్య‌కార్యాల్లో మంచి జ‌రుగుతుంది. ఉద్యోగంలో అధికారుల ప్ర‌శంస‌లు ఉంటాయి. ధ‌ర్మ‌మార్గంలో బాధ్య‌త‌ల‌ను పూర్తి చేయ‌డం ఉత్త‌మం. వ్యాపారం చాలా బాగుంటుంది. నూత‌న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అవుతాయి. మంచి నిర్ణ‌యంతో గొప్ప లాభాన్ని పొందే అవ‌కాశం ఉంది. ప‌నుల‌ను వాయిదా వేయ‌వ‌ద్దు.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

ఉద్యోగంలో శ్ర‌ద్ధ పెంచితే త‌గిన ప్రోత్సాహం ల‌భిస్తుంది. ఇప్పుడు చేసే ప‌నులు స్థిర‌మైన జీవితాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో ప‌ని చేయండి. ప‌లు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. స‌కాలంలో చేసే ప‌నులు శక్తిని ఇస్తాయి. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి. శాంత‌చిత్తంతో మాట్లాడాలి. కుటుంబ ప‌రంగా శాంతి ల‌భిస్తుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

వ్యాపార రంగంలో విజ‌యం వరిస్తుంది. ప్ర‌ణాళిక‌తో ప‌ని చేస్తే అద్భుత‌మైన ఫ‌లితాలు ఉంటాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఉద్యోగ ప‌నులు స‌కాలంలో చేయాలి. తెలియ‌ని విఘ్నాలున్నాయి. తొంద‌ర‌ప‌డ‌వ‌ద్దు. ప‌రిస్థితులు అనుకూలించే వ‌ర‌కు మౌనం వ‌హించాలి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

శ్రేష్ట‌మైన ఫ‌లితం ఉంటుంది. స్వ‌ల్ప ప్ర‌య‌త్నంతోనే విజ‌యం అందుకుంటారు. త‌గు నిర్ణ‌యాలు తీసుకుని ప‌ని చేయండి. మీ ప్ర‌వ‌ర్త‌న న‌లుగురికి ఆద‌ర్శం అవుతుంది. వ్యాపారంలో మిశ్ర‌మ ఫ‌లితం సూచితం. చంచ‌ల‌త్వం ప‌నికి రాదు. చెడు ఆలోంచించ‌వ‌ద్దు. బంధుమిత్రుల‌తో ఆనందిస్తారు.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

Advertisement

వ్యాపారం బాగుంటుంది. ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌తారు. ప‌నుల‌ను మ‌ధ్య‌లో ఆప‌వ‌ద్దు. కార్య‌సాధ‌న‌లో ఓర్పు చాలా అవ‌స‌రం. ఉద్యోగంలో నిరుత్సాహం వ‌ద్దు. వారం మ‌ధ్య‌లో ఒక మంచి ప‌ని పూర్తి చేస్తారు. మీ వ‌ల్ల కుటుంబ‌స‌భ్యుల‌కు క‌లిసి వ‌స్తుంది.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

సామ‌ర‌స్య ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించి ఉద్యోగంలో స‌మ‌స్య‌ని అధిగ‌మిస్తారు. మీరు కోరుకున్న ఫ‌లితం వ‌స్తుంది. పెద్ద‌ల ఆశీస్సులు ల‌భిస్తాయి. చంచ‌ల మ‌న‌స్త‌త్వం ప‌నికి రాదు. వృథా వ్య‌యం పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఇంట్లో శుభం జ‌రుగుతుంది. శుభ‌వార్త వింటారు. వ్యాపారంలో సొంత నిర్ణ‌యం మేలు చేస్తుంది.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

కాలం అనుకూలంగా లేదు. పొర‌పాట్లు జ‌రుగ‌కుండా ప‌ని చేయాలి. ఉద్యోగంలో స‌మ‌స్య‌లు ఉంటాయి. తెలియ‌ని విష‌యాల్లో త‌ల దూర్చ‌వ‌ద్దు. అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. స‌మిష్టికృషి స‌త్ఫ‌లితాన్ని ఇస్తుంది. వ్యాపారం అనుకూలంగా లేదు. కాలం స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తోంది. మౌనం అవ‌స‌రం. ఇష్ట‌దైవంతో పాటు న‌వ‌గ్ర‌హ‌శ్లోకాలు చ‌ద‌వండి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉత్త‌మ‌కాలం న‌డుస్తోంది. అదృష్టం క‌లిసి వ‌స్తుంది. స‌రైన నిర్ణ‌యాల‌తో కోరిక‌ల‌ను నెర‌వేర్చుకోవాలి. ఎటు చూసినా శ్రేష్ట‌మైన ఫ‌లిత‌మే గోచ‌రిస్తోంది. ఉద్యోగంలో అనుకున్న‌ది సాధిస్తారు. అధికారుల ప్ర‌శంస‌లు ఉంటాయి. వ్యాపారంలో లాభం ఉంది. నూత‌న ప్ర‌య‌త్నాలు ప‌లిస్తాయి. ఆర్థికంగా మంచి కాలం ఇది. కుటుంబ స‌హ‌కారం ల‌భిస్తుంది.

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

ఉద్యోగం చాలా బాగుంటుంది. నైపుణ్యం వృద్ధి చెందుతుంది. స్థిర‌చిత్తంతో ల‌క్ష్యాన్ని చేరాలి. ధైర్యంగా తీసుకునే నిర్ణ‌యాలు విజ‌యాన్ని ఇస్తాయి. తోటివారి ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారంలో స‌మ‌స్య రాకుండా చూసుకోవాలి. ఆర్థిక విష‌యాల్లో త‌డ‌బాటు ప‌నికి రాదు. మొహమాటం వ‌ల్ల ఇబ్బందులు త‌లెత్తుతాయి.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

కీల‌క కార్యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉంటే అనుకున్న‌ది నెర‌వేరుతుంది. ఆర్థికంగా ఉద్యోగంలో ప్ర‌శంస‌లు ఉంటాయి. ప‌నుల‌ను స‌కాలంలో చేయాలి. కొత్త విష‌యాలు తెలుసుకుంటూ మంచి భ‌విష్య‌త్ ను నిర్మించుకోవాలి. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చేసే ప‌నులు విజ‌యాన్ని ఇస్తాయి. ఒక ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

ఉద్యోగం అనుకూలం. నిండు మ‌న‌సుతో చేసే ప‌ని త్వ‌ర‌గా విజ‌యాన్ని ఇస్తుంది. ధ‌ర్మ‌మార్గంలో ల‌క్ష్యాల‌ను సాధించాలి. తెలియ‌ని విఘ్నాలు ఉంటాయి. కాలం వృథా చేయ‌కుండా ముఖ్య‌మైన వ్య‌క్తుల‌తో చ‌ర్చిస్తూ స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవాలి. వారం మ‌ధ్య‌లో మేలు జ‌రుగుతుంది. దృఢ‌సంక‌ల్పంతో ముందుకు సాగండి.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

మ‌నోబ‌లంతో ప‌ని ప్రారంభించండి. ఒత్తిడి ఉన్నా మీ బాధ్య‌త‌ల‌కు ఆటంకం క‌లుగ‌దు. అంతా మీరు ఊహించిన‌ట్టే జ‌రుగుతుంది. చంచ‌ల స్వ‌భావం వ‌ల్ల ప‌నులు జ‌రుగ‌కుండా చూసుకోవాలి. త్రిక‌ర‌ణ శుద్ధితో ప‌ని చేయాలి. ఆత్మీయుల సూచ‌న‌లు తోడ్ప‌డుతాయి. వ్యాపారంలో సొంత నిర్ణ‌యం ర‌క్షిస్తుంది.

 

Visitors Are Also Reading