Home » sep 24th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

sep 24th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY

modi

NIA దాడుల్లో ప్రధాని మోడీ హత్యకు PFI కుట్ర బట్టబయలు అయ్యింది. పాట్నా పర్యటన సమయంలో దాడికి విఫలయత్నం చేసినట్టు తేలింది. దాడులు చేసేందుకు పలువురికి శిక్షణ ఇవ్వడంతో పాటూ యూపీకి చెందిన మరికొందరు ప్రముఖులపై దాడులకు కుట్ర జరిగినట్లు తెలిసింది. NIAదాడుల తర్వాత PFI ఆర్థిక కార్యకలాపాలపై ఈడీ ఆరా తీస్తోంది.


ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. ఈ సమావేశం లో రూ.100 కోట్ల వ్యయంతో వసతి సముదాయం….రూ.33 కోట్ల వ్యయంతో క్యూ లైను నిర్మాణానికి ఆమోదం తెలపనున్నారు.

 

మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్ కమిటీ సన్నాహక సమావేశం ఏర్పాటచేశారు. 12 గంటలకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీటింగ్..వివేక్ నేతృత్వంలో 16 మందితో బిజెపి స్టీరింగ్ కమిటీ వేసింది. మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలను స్టీరింగ్ కమిటీ చర్చించనుంది.

 

కుప్పం నేతలకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజరు చేశారు. గతంలో చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలో జరిగిన గొడవల సమయంలో అరెస్టయిన మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, ఇతర టీడీపీ నేతలకు బెయిల్ మంజూరు అయ్యింది.

 

17వ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ఒకరోజు విరామం తర్వాత నేడు పునఃప్రారంభం కానుంది. రాహుల్ గాంధీ పాదయాత్ర లో ఇప్పటివరకు 333 కిలోమీటర్ల భారత్ జోడో పాదయాత్ర.

 

 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో పర్యటించనున్నారు.10.30కు శ్రీనగర్ కాలనీలో రక్తదాన శిబిరం..11 గం.లకి ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రికి అంబులెన్స్ అందజేత..12 గం.లకి ఖైరతాబాద్ మింట్ మ్యూజియం టూర్.. సాయంత్ర 5.30 గం.కొండాపూర్ HITEXలో చిరుధాన్యాలపై రెండు రోజుల సదస్సు లను సందర్శిస్తారు.

 

హైదరాబాద్ HCUలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పలువురు విద్యార్థులకు గాయాలు కాగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో క్వాలిఫై అయిన విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ధర్నాకు దిగారు.

 

 

నాగపూర్ టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

 

నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఒకేరోజు బృందాలుగా ఏర్పడి అధికారుల తనిఖీలు నిర్వహించారు. నల్గొండలో 5 ల్యాబ్‌లు, ఒక ప్రైవేట్ ఆస్పత్రి సీజ్.. మరో 6 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు అందజేశారు. ఆదిలాబాద్‌లో 3, ములుగులో 3 ఆస్పత్రులు, జగిత్యాల జిల్లాలో 2 ప్రైవేట్ ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు అందజేశారు.

Visitors Are Also Reading