మనం రోడ్డుపై నడవడం చాలా బాధ్యతాయుతమైన పని అలాగే,మీరు మోటారు వాహనంలో వెళ్తున్నట్లు అయితే మీ బాధ్యత మరింత పెరుగే అవకాశం ఉంటుంది.కాబట్టి వాహనదారులు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. దీనివల్ల సురక్షితమైన ట్రాఫిక్ వాతావరణం సృష్టించబడుతుంది. ట్రాఫిక్కు సంబంధించి అనేక నియమా, నిబంధనలు ఉన్నాయి. సురక్షితమైన ట్రాఫిక్ వాతావరణాన్ని సృష్టించడం కోసం, కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఖచ్చితంగా నియమాలు అమలు చేస్తున్నాయి.
Advertisement
also read:క్యూట్ స్మైల్ ఇస్తున్న ఈ చిన్నారి.. ఒక్క మూవీతోనే కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టింది..!!
ఈ నియమాలు తెలుసుకొని పాటించడం అవసరం. ఎన్ని నిబంధనలు పెట్టినా, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే మీకు భారీ జరిమానా విధించవచ్చు. దీనితో పాటు జైలు శిక్ష కూడా పడవచ్చు. జరిమానా మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ సమయంలో అనేక ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే, అన్ని నిబంధనలను ఏకకాలంలో ఉల్లంఘించినందుకు మీకు భారీగా జరిమానా విధించబడుతుందో చూద్దాం.
Advertisement
ఉదాహరణకు, మీ కారుకు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే మరియు మీ డ్రైవింగ్ లైసెన్స్, దానితో పాటు మీరు తాగి ఉండటం, కారుకు బీమా లేకుండా ఉండటం, ఈ పరిస్థితిలో, పోలీసులు మిమ్మల్ని ఆపినట్లయితే, వాటన్నిటికీ జరిమానా విధించవచ్చు. కానీ ఏదైనా ఒక నియమాన్ని ఉల్లంఘించినందుకు కాదు. మీకు అన్ని రకాల చలాన్లు పడే అవకాశం ఉంటుంది. అలాగే మీరు రెండోసారి మద్యం తాగి వాహనం నడిపితే రూ.15 వేలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.10 వేలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే రూ.10 వేలు, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ.4 వేల వరకు. ఇవన్నీ కలగలిపితే 39 వేల రూపాయలు అవుతుంది. కాబట్టి వాహనదారులు అలా జాగ్రత్త..
also read:
- చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ? డైరెక్టర్ గారు ! ‘సీత రామం” లో దర్శకుడు మిస్ అయిన లాజిక్ గమనించారా ?