Home » పెళ్లి వ‌య‌సు దాటిపోతున్నా సంబంధాలు కుద‌ర‌డం లేదా…ఈ వాస్తు చిట్కాలు పాటించండి..!

పెళ్లి వ‌య‌సు దాటిపోతున్నా సంబంధాలు కుద‌ర‌డం లేదా…ఈ వాస్తు చిట్కాలు పాటించండి..!

by AJAY
Published: Last Updated on
Ad

జీవితంలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే. కష్ట సుఖాల్లో తోడు ఉండేందుకు చివరి వరకు తమతో ఉండేందుకు భాగస్వామిని కోరుకుని పెళ్ళిచేసుకుంటారు. అయితే కొందరికి అనుకున్న సమయానికి వివాహం జ‌రిగితే మరికొంతమందికి ఉద్యోగం… ఆస్తులు అన్నీ ఉన్నా కూడా అనుకున్న సమయానికి వివాహం జ‌ర‌గ‌క ఇబ్బందిపడుతుంటారు. అయితే అనుకున్న‌ సమయంలో పెళ్లి జరగకపోవడానికి వాస్తు కూడా ఒక‌ కారణం అవుతుందని… వాస్తు శాస్త్రంలో సూచించిన కొన్ని చిట్కాలను పాటిస్తే అనుకున్న సమయానికి వివాహం జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం….

Advertisement

1)వివాహం ఆలస్యం అవుతుందని అనుకున్న వ్యక్తులు తమ పడక గదిలో ఒక జత మాండరిన్ బాతుల‌ విగ్రహాన్ని ఉంచుకోవాలి. వాటిలో మగ ఆడ రెండు ఉండేలా చూసుకోవాలి.. అలా చేస్తే త్వరగా వివాహం జరుగుతుంది వాస్తునిపుణులు చెబుతున్నారు.

Advertisement

2)వివాహం చేసుకోవాలనుకుంటున్న‌వారు వారి గదిలో లేత గులాబీ వేసుకోవాల‌ట‌. చాలా ముదురు గోధుమ నీలం నలుపు రంగులను గ‌దిలో వేసుకోకూడదు ఎందుకంటే అలాంటి రంగులు ప్రతికూల శక్తులను కలిగి ఉంటాయి.

3)పెళ్లి కావాల్సిన వారి పడకగది ఉత్తర గోడ పై రాధాకృష్ణ… శివపార్వతి లేదా వివాహిత దేవుళ్ల జంటల చిత్రాల‌ను ఉంచుకోవాలి.

4)వివాహం కావాలనుకునే వారు గది నైరుతి వైపున రెండు క్రిస్టల్ బాల్స్ ను ఉంచుకోవాలి. దాని ద్వారా మంచి భాగస్వామిని పొందాలి అనుకునే వారి కల నెరవేరుతుంది.

5)పెళ్లి చేసుకోవాలనుకునే వారు పడకగది నైరుతి మూలలో కత్తులు… కత్తెర లాంటి పదునైన వస్తువులను ఆయుధాలను ఉంచవద్దు.

6) వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్లి చేసుకునే అమ్మాయి… అబ్బాయి వాయవ్యంలో తలను పెట్టి నిద్రపోవాల‌ట‌. దక్షిణం వైపు తల పెట్టి నిద్ర పోవద్దు…. దక్షిణం వైపు తలపెట్టి పడుకుంటే వివాహం ఆలస్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

also read :భార‌తీయ డ్రైవింగ్ లైసెన్స్ ఈ దేశాల్లో కూడా ప‌నిచేస్తుంద‌ని తెలుసా..?

Visitors Are Also Reading