నందమూరి తారకరామావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ టాలీవుడ్ లో అగ్రహీరోలుగా కొనసాగారు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అప్పట్లో పెద్ద హీరోలందరూ కలిసి నటించారు. వారికి వారు పోటీ ఉన్నప్పటికీ వారు కలిసి ఒకే సినిమాలో నటించడం గొప్ప విషయం. ప్రస్తుతం అరకొర సినిమాల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్-ఏఎన్నార్ కలిసి ఏయే సినిమాల్లో కలిసి నటించారు. వీరి మధ్య ఎలాంటి పోలికలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
పల్లెటూరి పిల్ల
పల్లెటూరి పిల్ల సినిమాలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా. ఇది ఏప్రిల్ 27, 1950 విడుదలైంది ఈ చిత్రం. ఇందులో ఎన్టీఆర్, ఏఎన్నార్ అన్నదమ్ములుగా కలిసి నటించారు.
సంసారం
పల్లెటూరి పిల్ల చిత్రం తరువాత ఎన్టీఆర్-ఏఎన్నార్ కలిసి నటించిన చిత్రం సంసారం. ఈ సినిమా డిసెంబర్ 29, 1950లో విడదలైన నిర్మాత కే.వీ. కృష్ణ మరణించడం చేత ప్రదర్శన ఆపేసి మళ్లీ జనవరి 05, 1951లో ప్రారంభించారు. ఈ సినిమా విజయవంతై 11 థియేటర్లలో శతదినోత్సవాలు జరుపుకుంది.
పరివర్తన
తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన పరివర్తన చిత్రం సెప్టెంబర్ 01, 1954లో విడుదలైంది. జనతా ప్రొడక్షన్స్ పై సీడీ వీరసింహ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో ఎన్టీఆర్, ఏఎన్నార్ సావిత్రి, తదితర తారాగణం నటించారు.
మిస్సమ్మ
మిస్సమ్మ సినిమా జనవరి 12, 1955లో విడుదలైంది. అద్భుతమైన పూర్తి నిడివి హాస్య చిత్రం. ఎల్.వీ. ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు సిని పరిశ్రమలోనే పెద్ద హీరోలుగా పేర్గాంచిన ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించారు. మహానటి సావిత్రి కీలక పాత్ర పోషించారు.
రేచుక్క
రేచుక్క 1955 మార్చి 25న విడుదలైంది. ప్రతిభ స్టూడియోస్ లిమిటేడ్ పతాకంపై ఘంటసాల కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు పుల్లయ్య దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అక్కినేని గెస్ట్ రోల్ చేశాడు. ఈ చిత్రానికి గుడిమెట్ల అశ్వత్ధామ సంగీతం అందించారు. ఎన్టీఆర్, అంజలీదేవి ప్రధాన తారాగనంగా నటించారు.
తెనాలి రామకృష్ణ
తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని కవీంద్రులు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. చాయగ్రాహకుడు బి.ఎస్. రంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, వి.నాగయ్య, భానుమతి రామకృష్ణ, జమున కీలక పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో నటించగా.. నాగేశ్వరరావు తెలుగులో తెనాలి రామకృష్ణ పాత్రలో నటించారు. తమిళంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో నటించగా.. శివాజీ గణేశన్ తెనాలి రామకృష్ణ పాత్రలో నటించడం విశేషం. జనవరి 12, 1956లో ఈ చిత్రం విడుదలైంది.
Advertisement
చరణదాసి
ఎన్టీఆర్-ఏఎన్నార్ కలిసి నటించిన మరో చిత్ర చరణదాసి. ఈ చిత్రానికి టి.ప్రకాశరావు దర్శకత్వం వహించారు. అంజలిదేవి, సావిత్రి, ఎస్‌వీ రంగారావు తదితరులు నటించారు. 1956లో సినిమా విడుదలైంది.
మాయాబజార్
మాయాబజార్ సినిమా తెలుగులో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాగిరెడ్డి, చక్రపాణిలు నిర్మాతలుగా కే.వీ.రెడ్డి దర్శకత్వం వహించారు. 1957 మార్చి 27న విడుదల అయింది.
భూ కైలాస్
ఈ చిత్రంలో కూడా ఏఎన్నార్-ఎన్టీఆర్ కలిసే నటించారు. ఈ చిత్రం 1958లో విడుదలైంది.కె.శంకర్ దర్శకత్వం వహించారు. రావణాసూరుడు ఎన్టీఆర్, నారదుడుగా ఏఎన్నార్, మయాసుకెడిగా ఎస్వీ రంగారావు నటించారు.
గుండమ్మ కథ
గుండమ్మ కథ కమాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1962లో విజయ వాహినీ సంస్థ నిర్మించిన చిత్రం ఇది. ప్రధానంగా సూర్యకాంతం, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్.వి.రంగారావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రలు పోషించారు. చక్రపాణి, డి.వి. నరసరాజు రచయితలు.
శ్రీకృష్ణార్జున యుద్ధం
శ్రీకృష్ణార్జున యుద్ధం 1963లో వచ్చింది. కృష్ణుడికి, అర్జునుడికి మధ్య యుద్ధం నేపథ్యంలో జరుగుతుంది. చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడిగా, ఏఎన్నార్ అర్జునుడిగా నటించారు. బి.సరోజా దేవి సుభద్ర పాత్రను, ఎస్.వరలక్ష్మి, సత్యభామ పాత్రలను పోషించారు.
చాణక్య-చంద్రగుప్త
చాణక్య చంద్రగుప్త 1977లో విడుదలైంది. నాగేశ్వరరావు చాణక్యుడిగా, ఎన్టీఆర్ చంద్రగుప్తునిగా నటించారు. తమిళ నటుడు శివాజీ గణేషన్ అలెగ్జాండర్ పాత్రలో కనిపించారు.
రామకృష్ణులు
1978లో రామకృష్ణులు అనే చిత్రం వచ్చింది. ఇందులో ఎన్టీఆర్, నాగేశ్వరరావు మొదటిసారిగా ఎన్టీఆర్‌తో కలిసి వీ.బీ. రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సత్యం-శివం :
సత్యం శివం 1981లో వచ్చిన యాక్షన్ చిత్రం. ఈశ్వరి క్రియేషన్స్ పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో డి.వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శ్రీదేవి, రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చాడు.