Home » పురుషుల కంటే ముందు పాకిస్థాన్ తో తలపడనున్న భారత మహిళలు..!

పురుషుల కంటే ముందు పాకిస్థాన్ తో తలపడనున్న భారత మహిళలు..!

by Azhar
Ad

ఇండియా, పాకిస్థాన్ అంటేనే ఆ క్రేజ్ అనేది వేరే లెవల్ లో ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. ఇంకా రెండు దేశాలలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న క్రికెట్ లో ఈ రెండు దేశాల జట్లు పోటీ పడుతున్నాయి అంటే ఆసక్తి అనేది ఇంకా పెరిగిపోతుంది. అయితే ఈ ఏడాది ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో మన జట్టు రెండు మ్యాచ్ లలో పోటీ పడింది.

Advertisement

అలాగే వచ్చే నెలలో ప్రపంచ కప్ సందర్భంగా అక్టోబర్ 23న మళ్ళీ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అనేది ఉంది. కానీ ఇది పురుషుల మ్యాచ్. అయితే అంతకంటే ముందే పాకిస్థాన్ తో మన మహిళల జట్టు పోటీ పడుతుంది. అక్టోబర్ 1 నుండి మహిళలు ఆసియా కప్ అనేది ప్రారంభం అవుతుంది. ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 7న పాకిస్థాన్ మహిళలతో మన హర్మాన్ ప్రీత్ సేన తలపడుతుంది.

Advertisement

ఆసియా కప్ లో పోటీ పడే భారత మహిళల జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధాన (VC), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, రోడ్రిగ్స్, ఎస్ మేఘన, రిచా ఘోష్ (WK), స్నేహ రాణా, డి హేమలత, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, పి వస్త్రాకర్, ఆర్ గయాక్వాడ్, రాధా యాదవ్ , KP నవ్‌గిరే

స్టాండ్‌బై ప్లేయర్‌లు: తానియా సప్నా భాటియా, సిమ్రాన్ దిల్ బహదూర్.

ఇవి కూడా చదవండి :

తన తప్పును జట్టు మొత్తం మీద నెడుతున్న రాహుల్..?

బుమ్రా ఫిట్ గా లేడా.. ఫ్యాన్స్ ఆగ్రహం..!

Visitors Are Also Reading