Home » నా బ్యాచ్ హీరోలందరూ దొంగలే : నటి విజయశాంతి..!!

నా బ్యాచ్ హీరోలందరూ దొంగలే : నటి విజయశాంతి..!!

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో నటి విజయశాంతి అంటే తెలియని వారు ఉండరు.. ఆమె 1979లో తొలిసారి కథానాయికగా పదిహేనేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. భారతీరాజా వంటి సృజనశీలి వద్ద నటన పాటవాలు నేర్చుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సత్యం శివం, పెళ్లీడు పిల్లలు, కిలాడి కృష్ణుడు, కృష్ణావతారం, రాకాసిలోయ, పెళ్లిచూపులు వంటి చిత్రాల్లో ఆడిపాడే కథానాయిక వేషాలు వేసింది..1981 లో వచ్చిన రజంగం అనే మూవీలో స్విమ్ సూట్ ధరించి సంచలనాలకు తెర లేపింది.. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి,రాజశేఖర్, సుమన్ వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది..ఆమె వారితో చేసిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి.

Advertisement

ALSO READ;విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌.. అందుకోస‌మేనా..?

Advertisement

దీంతో ఇండస్ట్రీ లో తిరుగులేని హీరోయిన్ గా మార్మోగిపోయింది విజయశాంతి. ఆ తర్వాత మెల్లిగా 1998లో రాజకీయ ఆరంగేట్రం చేసింది. మొదట బిజెపి పార్టీలో చేరిన రాములమ్మ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర లక్ష్యం కోసం 2005లో తెలంగాణ తల్లి పార్టీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2009లో టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి తెరాస లోనే ఉండిపోయింది. 2009లో మెదక్ పార్లమెంటు నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది.. 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరింది.. అయితే తను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు సినిమాల్లో నటించే సమయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది.. మీరు ఇంత పారితోషకం తీసుకోవడానికి కారణం తెలంగాణ ప్రజలు కాదా..? దీనిపై మీ స్పందన ఏంటి? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంటే ఒక్క హీరో కూడా సమాధానం ఇవ్వలేదు..

మీ బ్యాచ్ హీరోలు భయపడుతున్నారా అని ఒక యాంకర్ ప్రశ్నించగా.. విజయశాంతి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నా బ్యాచ్ హీరోలంతా ముసుగు వేసుకున్న దొంగలు.. వాళ్లు తీసుకున్న రెమ్యూనరేషన్ లో కనీసం 20 శాతం కూడా ప్రజల కొరకు ఖర్చు చేయడం లేదని.. వారు సినిమాల్లో మాత్రమే హీరోలు కానీ, బయట జీరోలు అనే విధంగా మాట్లాడింది.. ప్రజలు దండేసి అభినందిద్దాం అని అనుకునే ఒక్క హీరో కూడా లేదు అంటూ చెప్పుకొచ్చింది.. ఒసేయ్ రాములమ్మ సినిమా విజయం సాధించిన తర్వాత ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి అడుగు పెట్టానని, నేను అనుకుంటే ఎప్పుడో కేంద్రమంత్రి అయ్యేదాన్ని అని ఆ ఇంటర్వ్యూలో విజయశాంతి హీరోలపై కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేసింది.

ALSO READ;కృష్ణంరాజు కోసం 12 ఏళ్ల త‌రువాత తొలిసారి ప్ర‌భాస్ అక్క‌డికి..!

Visitors Are Also Reading