ప్రతీ రోజు వంటల్లో రకరకాల పదార్థాలను వినియోగిస్తుంటారు. ముఖ్యంగా నువ్వులు, పల్లీలు, దోస గింజలు వంటివి ఎక్కువగా చెట్నీలలో, కారం పొడి తయారీలో వాడుతుంటారు. ఇలా వంట్లో ఉపయోగించే నువ్వులు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. కొంత మంది మహిళలు నువ్వులు వేడి చేస్తాయని, త్వరగా అరగవు అని ఒక అపోహ పడుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు మందుగా పని చేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు.
Advertisement
స్త్రీలు తరుచుగా ఎదుర్కొనే హార్మోన్ల సమస్యను నివారిస్తాయి. రుతుక్రమ సమస్యలతో బాధపడేవారు రుతుక్రమానికి వారం లేదా పది రోజుల ముందు నువ్వులను పొడి చేసి దానిలో బెల్లం లేదా ఇంగువ కలిపి తీసుకుంటే ఆ సమయంలో వచ్చే నడుము నొప్పి, కడుపునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కండరాల బలహీనతతో బాధపడే పెద్దవారు, ఆస్టియోఫ్లోరోసిస్ తో బాధపడేవారు ఎదుగుదల సక్రమంగా లేని పిల్లలకు ఈ విధంగా ఇస్తే మంచి పలితం ఉంటుంది. ముందు రోజు ఒక స్పూన్ నువ్వులను నానబెట్టి ఉదయాన్నే ఆ నువ్వులను పాలతో కలిపి తీసుకుంటే వీరి సమస్య పరిష్కారమవుతుంది. రక్తహీనతతో బాధపడే పిల్లలకు, పెద్దవారికి ఇది ఓ టానిక్ మాదిరిగా పని చేస్తుంది.
Advertisement
ఇది కూడా చదవండి : గాడిద పాలతో తయారు చేసిన సబ్బు వాడితే కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
ఇక రాత్రి సమయంలో నానబెట్టిన నువ్వులను ఉదయాన్నే పరిగడుపున తినాలి. నెల రోజుల పాటు ఈ విధంగా రక్తహీనత నుంచి బయటపడవచ్చు. నువ్వులను నేరుగా లేదా ఆహారం ద్వారా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, లివర్ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ముఖం మీద ముడతలు, మచ్చలు ఉన్నవారు ప్రతి రోజు స్నానానికి ముందు నువ్వుల నూనె పట్టించాలి. అరగంట తరువాత శనగపిండితో రుద్దితే మీ చర్మం తలతలమెరుస్తుంది. నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. పావు కప్పు పాలలో లభించే కాల్షియం కన్నా పావు కప్పు నువ్వుల్లో ఉండే కాల్షియం మూడు రెట్లు అధికంగా ఉంటుంది. ప్రతీ రోజు స్పూన్ నువ్వులను తీసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది.
ఇది కూడా చదవండి : వర్షాకాలంలో మీ చిన్నారులను దోమ కాటు నుంచి రక్షించడానికి చిట్కాలు ఇవే..!