మనదేశంలో కులం ప్రభావం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అప్టేట్ అయ్యాం…కులం మత బేధాలు లేవని చాలా మంది అంటూ ఉంటారు. కానీ అక్కడక్కడా జరుగుతున్న దారుణాలు చూస్తే ఇప్పటికీ కులం ప్రభావం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇప్పటి కులం పేరుతో వేధింపులకు గురయ్యేవాళ్లు కూడా ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఘటననే అందుకు నిదర్శనం.
ఇవి కూడా చదవండి : రేణూ దేశాయ్ ఫ్యామిలీ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు…?
Advertisement
పూర్తి వివరాల్లోకి వెళితే….. తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లా శంకరం యూనియన్ గ్రామానికి చెందిన అన్బరసి అనే యువతి ఇంజనీరింగ్ పూర్తిచేసి ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. కాగా అన్బరసికి సోషల్ మీడియాలో రెండేళ్ల క్రితం లక్ష్మణన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్ల పాటూ ప్రేమలో మునిగి తేలిన ఈ జంట పెద్దలను ఒప్పటించి పెళ్లి చేసుకున్నారు.
Advertisement
పెళ్లి సమయంలో వధువు కుటుంబం వరుడికి కట్నకానులకు కూడా సమర్పించారు. లక్ష్మణన్ తో అన్బరసికి ఎలాంటి ఇబ్బంది లేదు. వీరిపచ్చని కాపురానికి గుర్తుగా ఓ బిడ్డ కూడా పుట్టింది. అయితే అత్తింటి వారి నుండి మాత్రం అన్బరసికి వేధింపులు తప్పలేదు. ప్రతి రోజు యువతిని కులం పేరుతో దూషించడం వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు.
ఇంట్లో అమె కులం పేరుతో వివక్ష చూపించడం మొదలు పెట్టారు. ఆమె ను ప్రత్యేక గదిలో ఉండమనటే కాకుండా ప్లేట్ కూడా ఆమెకు సపరేట్ గానే ఉండాలని నిర్ణయించుకున్నారు. దాంతో వేధింపులు భరించలేక యువతి ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించింది. ఈ ఘటన పై కేసు నమోదవ్వగా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి : “లైగర్” సినిమా ఎఫెక్ట్…అక్కడ ఫ్లాట్ ను ఖాళీ చేసిన పూరీజగన్నాత్..!