Home » త‌మిళనాడు ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందిన వారి వివ‌రాలు ఇవే

త‌మిళనాడు ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందిన వారి వివ‌రాలు ఇవే

by Bunty
Ad

త‌మిళనాడు రాష్ట్రంలో ని ఊటీ స‌మీపం లో గ‌ల కొండల్లో జ‌రిగిన ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో మొత్తం 13 మంది మ‌ర‌ణించారు. అలాగే మ‌రొక్క‌రు ప్రాణాల తో బ‌య‌ట ప‌డినా.. ఆయ‌న తీవ్ర గాయాలు కావ‌డం తో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఈ ప్ర‌మాదం లో త్రి ద‌ళ అధిప‌తి జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తో పాటు ఆయ‌న భార్య మ‌ధులిక రావ‌త్ ఉన్నారు.

Advertisement

అలాగే బిపిన్ రావ‌త్ సైనిక స‌ల‌హా దారు బ్రిగేడియర్ ఎల్ ఎస్ లిద్దర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వింగ్ క‌మాండ‌ర్ పీ. ఎన్ . చౌహాన్, స్క్వాడ్ర‌న్ లీడ‌ర్ కే. సింగ్, జూనియ‌ర్ వారెంట్ ఆఫీస‌ర్ దాస్, జూనియ‌ర్ వారెంట్ ఆఫీస‌ర్ ఎ. ప్ర‌దీప్, హ‌వాల్దార్ స‌త్సాల్, నాయ‌క్ గురు సేవ‌క్ సింగ్, నాయ‌క్ జితేంద‌ర్ కుమార్, లాన్స్ నాయ‌క్ వివేక్ కుమార్ తో పాటు ఆంధ్ర ప్ర‌దేశ్ లో ని చిత్తూర్ జిల్లా వాసి లాన్స్ నాయ‌క్ సాయితేజ కూడా ఉన్నారు. ఈ ప్ర‌మాదం లో ప్రాణాల తో ఒక‌రు మాత్ర‌మే బ‌య‌ట ప‌డ్డారు. అయ‌నే ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్.

Advertisement

అయితే ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింది అనే దానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఆధారాలు లేవు. హెలికాప్ట‌ర్ కు సంబంధించిన బ్లాక్ బాక్స్ ల‌భించ‌డం తో ప్ర‌మాదం గురించి పూర్తి వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది. అయితే త్రిదళాధిపతి బిపిన్ రావత్ సూలూర్​ వైమానిక స్థావరం నుంచి వెల్లింగ్టన్​లోని డిఫెన్స్​ సర్వీసెస్​ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. నీలగిరి జిల్లాలోని కొండ ప్రాంతాల్లో శిథిలాలు పడిపోయాయి. భార‌త‌ సైన్యం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.

Visitors Are Also Reading