ఆలయాలు లేని దేవుడంటూ లేడు. ప్రతి దేవుడికి దేవాలయాలు ఉంటాయి. అంతే కాకుండా చాలా మంది దేవుళ్లకు ఒకే ఊరిలో రెండు మూడు ఆలయాలు ఉంటాయి. ఇక కొన్ని దేవస్థానాలకు ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఇక కొందరు దేవుళ్లను కొన్ని కుటుంబాలు తమ ఇంటి దేవుళ్లుగా కొలుచుకుంటారు. అయితే అందరి తలరాతలు రాసాడని చెప్పుకునే బ్రహ్మకు మాత్రం దేవాలయాలు లేవు. బ్రహ్మను ఎవరూ పూజించరు. ఇంటిదైవంగా కొలిచినట్టు ఎక్కడా కనిపించదు.
Advertisement
పూజించడం పక్కన పెట్టి ఎలాంటి రాత రాసావు దేవుడా అంటూ తిడతారు కూడా. అయితే బ్రహ్మకు ఎందుకు దేవాలయాలు లేవో చెప్పేందుకు ఓ కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు బ్రహ్మ దేవుడికి విష్ణు దేవుడికి ఇద్దరిలో ఎవరు గొప్ప అనే సందేహం వచ్చిందట. అయితే అప్పుడే శివుడు అగ్నిస్తంభ లింగాకృతిలో ప్రత్యక్షమై తన ఆద్యంతాలు ముందుగా ఎవరు కనుక్కోగలిగితే వారే గొప్ప అని చెప్పాడు. దాంతో బ్రహ్మ దేవుడు లింగానికి పై వైపు…విష్ణువు కింది వైపును అన్వేషిస్తూ వెళ్లారు.
Advertisement
అయితే విష్ణుమూర్తి తిరిగి వచ్చి తాను ఈశ్వరుని అంతం కనిపెట్టలేకపోయానని చెప్పాడు. కానీ బ్రహ్మ దేవుడు అక్కడే ఓ తప్పు చేశాడు. తాను శంకరుని ఆది కనుగొన్నానని గోవు మొగలిపూవులతో అబద్దపు సాక్ష్యాలు చెప్పించాడు. బ్రహ్మ దేవుడు చెప్పిన అబద్దానికి శివుడికి కోపం వచ్చింది. ఆగ్రహానికి గురైన శివుడు బ్రహ్మ దేవుడిని శపించాడు. నీకు ఆలయాలు పూజలు నోములు ఉండని శపించాడు. అలా శివుడు శపించడం వల్లనే ఇప్పటి వరకూ మనిషి తల రాతను రాసినా కూడా బ్రహ్మ దేవుడికి ఆలయాలు లేవట. నోములు పూజలు చేయడం లేదట.
Also Read: కొత్తజీవితంలోకి అడిగుపెట్టిన బాలీవుడ్ జంట..ఫస్ట్ వెడ్డింగ్ ఫోటో వైరల్..!