పెళ్లి అనేది జీవితంలో అతిముఖ్యమైన ఘట్టం. పెళ్లి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వారి అలవాట్లు కోరికలు వారి లోపాలు ఇలా అన్ని తెలుసుకున్న తరవాతనే పెళ్లి చేసుకోవాలి. అంతేకాకుండా జీవితాంతం కలిసి ఉండేది వారిద్దరే కాబట్టి ఖచ్చితంగా ఒకరికొకరు నచ్చితేనే పెళ్లి చేసుకోవాలి లేదంటే వైవాహిక జీవితంలో సమస్యలు తప్పవు.
ఇవి కూడా చదవండి: భార్యా భర్తల మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ ను పెంచే 4 పదాలు..ఇవి వాడితే అసలు గొడవలే ఉండవట..!
Advertisement
అంతే కాకుండా గొడవలు మొదలయ్యాయంటే అవి విడాకుల వరకు కూడా వెళ్లే ప్రమాదం ఉంది. భార్య భర్తలు ఇద్దరూ వేరు వేరు వాతావరణం నుండి వస్తారు. ఇద్దరి రుచులు అభిరుచులు వేరు వేరుగా ఉంటాయి. పెళ్లికి ముందు ఎవరికి నచ్చినట్టు వాళ్లు చేసినా చెల్లుతుంది. కానీ పెళ్లి తరవాత మాత్రం వేరుగా ఉంటుంది. జంటలో ఏ విషయమైనా ఇద్దరికీ నచ్చితేనే బాగుంటుంది.
Advertisement
ఇదిలా ఉంటే పెళ్లి తరవాత చేసే ఒక తప్పు వల్లనే భార్యభర్తలకు ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. కొంత మంది పెళ్లికి ముందు ఎంతో ప్రేమ చూపించుకుంటారు. వారి పార్ట్నర్ గురించి చాలా ఆలోచిచండంతో పాటూ కేరింగ్ తీసుకుంటారు. పెళ్లైన కొద్ది రోజుల పాటూ కూడా ఆ ప్రేమ కేరింగ్ అలానే ఉంటాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరేమో అనిపించేలా ప్రవర్తిస్తూ ఉంటారు.
కానీ పెళ్లి జరిగిన తరవాత కొన్నేళ్లకు లెక్కలు మారిపోతాయి. ఒకరిని ఒకరు పలకరించుకోవడం కూడా చేయరు. అసలు పట్టించుకోవడం కూడా కష్టమే. అయితే అదే కొంప ముంచుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. మొదట ఎక్కువ ప్రేమ చూపించి ఆ తరవాత పట్టించుకోకపోవడం వల్ల గొడవలు వస్తాయని కాబట్టి ఎప్పుడూ ఒకేవిధంగా ఉండాలని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: పూజ గదిలో ఈ పండు పెడితే పది రోజుల్లో అద్భుతాన్ని చూస్తారు.. ఏంటది..?