ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకొని ఆరో సీజన్లో కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ షో విజయవంతంగా ముందుకు పోతోంది. ఇప్పటికే 21 మంది కంటెస్టెంట్ హౌస్ లోకి చేరిపోయారు. ఇందులో ముఖ్యంగా కీర్తి భట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు తన జీవితంలో జరిగిన ఒక విషాద ఘటన ను వెలిబుచ్చింది.. మరి ఆమె ఎవరు? బిగ్ బాస్ లోకి ఎలా వచ్చింది?.. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. మొదటి కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి భట్ తన జీవితంలోని ఒక విషాదమైన ఘటనను చెప్పుకొచ్చింది.
Advertisement
ALSO READ;అందాల ప్రదర్శన చేయకున్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన నాచురల్ బ్యూటీలు వీళ్లే..!
గుడికి వెళ్లి వస్తున్న క్రమంలో కీర్తి తన కుటుంబాన్ని ప్రమాదంలో కోల్పోయానని ఎమోషనల్ అయ్యింది. కుటుంబంలో ఒక్కదాన్నే మిగిలానని నాకు అయిన వాళ్ళు ఎవరూ కూడా నన్ను చేరదీయ లేదని అన్నారు. నాలాంటి బ్రతుకు శత్రువు కు కూడా రాకూడదని తెలిపారు. అలాంటి పరిస్థితి నుండి నేను సొంత శక్తితో ఎదిగి బిగ్ బాస్ హౌస్ వరకు వచ్చానని కీర్తి చెప్పింది. నీకు నీ జీవితంలో ఇష్టమైన వారు ఎవరు అని నాగార్జున అడగగానే నా కూతురు అని చెప్పుకొచ్చారు కీర్తి. నేను ఒక పాపను దత్తత తీసుకున్నానని ఆమె చాలా అందంగా ఉంటుందని అన్నారు. జీవితంలో ఛాలెంజింగ్ గా ఎలా బతకాలో హౌస్ లోకి వెళ్లి మరీ నేర్చుకుంటానని అన్నారు.
Advertisement
అనంతరం కొన్ని కార్డు లు తీసుకువచ్చిన నాగార్జున అందులో ఒకటి సెలెక్ట్ చేయమన్నారు. కీర్తి వాటి నుంచి ఒక కార్డ్ ను ఎంచుకున్నారు. ఆమె తీసుకున్న కార్డు వెనుక వెన్నుపోటు సింబల్ ఉంది. అది తీసుకొని హౌస్ లోకి వెళ్లాలని కీర్తిని నాగార్జున సూచించారు. ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పారు. అసలు ఈ కీర్తి భట్ కార్తీకదీపం సీరియల్ ద్వారా హిమ పాత్ర లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సీరియల్ కూడా మంచి ఫామ్లో ఉంది. ప్రస్తుతం కీర్తి హౌస్ లోకి వెళ్లడంతో ఇక ఆమె పర్ఫామెన్స్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. అలాగే ఆమె రియల్ లైఫ్ గురించి చెప్పి చాలా మందిని ఆవేదనకు గురి చేసింది.
ALSO READ;లైగర్ ఫ్లాప్ తర్వాత ఆ బిగ్ డైరెక్టర్ దగ్గర ఛాన్స్ కొట్టేసిన విజయ్..!!