Home » లైగర్ ఫ్లాప్ తర్వాత ఆ బిగ్ డైరెక్టర్ దగ్గర ఛాన్స్ కొట్టేసిన విజయ్..!!

లైగర్ ఫ్లాప్ తర్వాత ఆ బిగ్ డైరెక్టర్ దగ్గర ఛాన్స్ కొట్టేసిన విజయ్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

విజయ్ దేవరకొండ హీరో గా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా లైగర్ బాక్సాఫీస్ వద్ద భారీగా పరాజయాన్ని చూసింది. దీంతో ఆయన సినీ కెరీర్ కు కాస్త ఒడిదుడుకుల్లో పడ్డ క్రమంలో విజయ్ దేవరకొండ కోసం ఒక బిగ్ డైరెక్టర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. హీరోగా ఒక రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న ఈ కుర్రాడు కాస్త డిస్టబెన్స్ అయినట్టు తెలుస్తోంది. గీత గోవిందం తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి రాలేదు. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా ఎంతో సక్సెస్ అవుతుందని అందరూ భావించారు. కానీ అంచనాలన్నీ తలకిందులై లైగర్ ఊహించని పరాజయం పాలైంది. దీంతో అభిమానులు అంతా నిరాశ చెందారు.

Advertisement

ALSO READ;అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌కున్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన నాచుర‌ల్ బ్యూటీలు వీళ్లే..!

Advertisement

ఇక లైగర్ సినిమాతో విజయ్ ని పాన్ ఇండియా స్టార్ గా చేయాలన్నా విజయ్ ని, అదే తరహాలో మరో సినిమాని కూడా లైన్ లో పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే జనగణమన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. లైగర్ రిజల్ట్ తర్వాత ఈ మూవీ ని ఇప్పుడే కాకుండా కొంత సమయం తీసుకొని షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాస్త డల్ అయ్యారు. అయితే ఇదే నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ వచ్చింది.

విజయ్ దేవరకొండ ను హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరో సినిమా చేసేందుకు రంగం లోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ చేయడం కోసం కమిట్ అయిన హరిష్ శంకర్ ఆయన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ పవన్ రాజకీయంగా బిజీగా ఉండటంతో, దిల్ రాజు చొరవతో విజయ్ దేవరకొండ తో మీటింగ్ జరిగిందని, వీరిద్దరి కాంబోలో సినిమా కోసం చర్చలు కూడా నడిచాయని తెలుస్తోంది. త్వరలోనే వీరి కాంబో లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది.

ALSO READ;ఎగ్జిబిష‌న్ లో ప్ర‌మాదం.. 50 అడుగుల ఎత్తు నుంచి కింద ప‌డిన జెయింట్ వీల్‌..!

Visitors Are Also Reading