పంజాబ్‌లోని మొహలీలో ప్రతీ సంవత్సరం దసరా ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఇక ఈ సంవత్సరం మొహలీలో రెండు నెలల ముందే ఓ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఆ దసరా ఎగ్జిబిషన్‌లో అక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. 50 అడుగుల ఎత్తులో గుండ్రంగా తిరిగే చక్రం లాంటిది తిరుగుతూ తిరుగుతూ కిందపడిపోయింది. ఇందులో సుమారు 50 మందికి పైగా కూర్చొని ఉన్నారు. వారిలో దాదాపు అందులో ఉన్న వారందరికీ గాయాలయ్యాయి. 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం.
మొహలోని ఫేజ్-8 దసరా ఉత్సవాల్లో భాగంగా ఓ మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని పీటీఐ తెలిపింది. అక్కడ జెయింట్ వీల్, ఊయల, రంగుల రాట్నం సహా పలు రకాల అమ్యూజ్‌మెంట్ రైడ్స్ ఉన్నాయి. అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులందరినీ మొహలీలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. నిర్వహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Advertisement
ఇది కూడా చదవండి : నదుల్లో కాయిన్స్ ఎందుకు వేస్తారో మీకు తెలుసా..?
Advertisement
Live Visual of swing breaking in #Mohali phase 8, Many people got injured. Around 16 women & kids were hospitalised after the incident. pic.twitter.com/bay5IfzHLB
— Nikhil Choudhary (@NikhilCh_) September 4, 2022
ఇక ఇక్కడ అంబులెన్స్, పీసీఆర్ లాంటి సౌకర్యాలు లేవు. ప్రమాదం జరిగిన 20 నిమిషాల తరువాత నిర్వాహకులు అక్కడికి వచ్చారు. వాళ్లు మద్యం సేవించి ఉండడం గమనార్హం. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏం జరుగలేదని ఓ మహిళా చీఫ్ వెల్లడించారు. ఎలాంటి భద్రత, అత్యవసర ఏర్పాట్లు లేకుండా ఈ జాతర ఎలా జరుగుతుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అధికారులు మాత్రం నోరు విప్పడం లేదు. మరోవైపు ఎగ్జీబిషన్ నిర్వహణకు అధికారికంగా అనుమతి ఇచ్చినట్టు డీఎస్పీ హరిసిమ్రన్ సింగ్ బల్ తెలిపారు. నిర్వాహకుల నుంచి తప్పు ఉన్నట్టు తేలితే మాత్రం చట్ట ప్రకారం.. కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : భర్త భార్యకు ఎప్పటికీ చెప్పకూడని 5 విషయాలు ఏవో తెలుసా ? 3వది చాల ముఖ్యమైనది ..!