Home » అంతటి కష్టం నుంచి దిల్ రాజ్ ను గట్టెక్కించిన బన్నీ.. ఎలాగంటే..?

అంతటి కష్టం నుంచి దిల్ రాజ్ ను గట్టెక్కించిన బన్నీ.. ఎలాగంటే..?

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ ప్రొడ్యూసర్ లలో దిల్ రాజుకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. ఈయన కథను బట్టి దానికి ఎంత బడ్జెట్ కెపాసిటీ సరిపోతుందో అంచనా వేయడంలో దిట్ట. ఆయన ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా అనేక సినిమాలను కొనుగోలు చేశారు. ఆయన కొనుగోలు చేశారు అంటే ఆ సినిమా గురించి ఎంతో హైప్ క్రియేట్ అవుతుంది. ఇటీవల రిలీజ్ అయిన బింబిసార మూవీని ఒక్క నైజాం ఏరియా కి గానే 5 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. అయితే ఈ కొనుగోలు చేసినందుకు చాలా మంది అతని తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నారని నవ్వుకున్నారు.

Advertisement

also read;ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: కృతిసనన్ వలలో పడ్డ ప్రభాస్..ఇక నెక్స్ట్ పెళ్లేనా..?

Advertisement

కానీ బింబిసార థియేటర్ లోకి వచ్చిన తర్వాత ఒక్క నైజాం లోనే 11 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో దిల్ రాజు పెట్టిన దానికి రెట్టింపు డబ్బు వచ్చింది. దీంతో అది చూసి నవ్వుకున్న వారంతా షాక్ అయిపోయారు. దిల్ రాజ్ జడ్జిమెంట్ గురించి అందరూ పొగుడుతున్నారు.. ఏది ఏమైనా అన్ని సందర్భాల్లో అతని జడ్జిమెంట్ క్లియర్ గా ఉండకపోవచ్చు.. దీనికి ప్రధాన ఎగ్జాంపుల్ ఇటీవలే విడుదలైన థాంక్యూ సినిమా.. అలాగే నవదీప్ హీరోగా వచ్చిన జై సినిమా 2004లో థియేటర్ లోకి వచ్చింది. దీనికి దర్శకుడుగా తేజ డైరెక్షన్ చేయగా, దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశారు.. దీనికి 2.25 కోట్ల రూపాయలు పెట్టి దిల్ రాజు దక్కించుకున్నాడు.

కానీ ఈ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో దిల్ రాజు కు రెండు కోట్ల నష్టం వాటిల్లిందట. పెట్టిన డబ్బులు సగం కూడా వెనక్కి రాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు దిల్ రాజు.. ఈ క్రమంలోనే అదే ఏడాది మే 7వ తేదీన విడుదలైన ఆర్య సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం కొనసాగించింది.. దీంతో నష్టపోయినటువంటి దిల్ రాజును భారీ నష్టాల నుంచి గట్టెక్కించింది బన్నీ హీరోగా నటించిన ఆర్య. ఒకవేళ ఈ సినిమా హిట్ కాకుంటే మాత్రం నేను కోలుకునేవాన్ని కాదని ఒకానొక సందర్భంలో దిల్ రాజు చెప్పుకొచ్చారు.

ALSO READ;ఎంత ఖ‌ర్చైనా భ‌రిస్తాను నాకు వైద్యం అందించండి…శ్రీలంక అధ్య‌క్షుడికి నిత్యానంద లేఖ‌..!

Visitors Are Also Reading