మహాభారతంలో ధృతరాష్ట్రుడి సవతి కొడుకు విదురుడు. ఇతను గొప్ప జ్ఞానవంతుడు. దూర దృష్టి కలిగి ఉన్న వ్యక్తి. కొన్ని సమస్యలను ముందుగానే ఊహించేవాడు. కురుక్షేత్ర యుద్ధం చాలా ఘోరంగా ఉంటుందని ధృతరాష్ట్రుడిని హెచ్చరించాడు. విదురుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ శ్రీకృష్ణుడితో పాటు విదురుడి సలహాలు కూడా ఉన్నాయి. పాండవులు విదురుడి మాటలకు చాలా గౌరవం ఇచ్చేవారట. భీష్ముడు కూడా విదురుడి సలహాలను తీసుకునేవాడు. విదురుడు చెప్పిన కొన్ని ప్రత్యేక విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
జీవితాన్ని చాలా ఈజీగా చేయడమే ముఖ్య ఉద్దేశ్యమట. జీవితాన్నీ ఈజీగా చేయడం కాకుండా ఎన్నో సమస్యల నుంచి మనుషులను రక్షిస్తాయి. విదుర నీతి అంశాలు మహాభారత కాలంలో ఉన్నట్టే ఈనాటికి సంబంధించినవి విదుర నీతిలో ఎవరి గౌరవం, జ్ఞానం, ఆనందం, స్నేహం నాశనం చేయబడుతాయో వారెవ్వరో తెలిపారు. చెడు అలవాట్లు కలవారు ఎంతటి జ్ఞానాన్ని అయినా తెలివిగలవాడైనా, అతని తెలివి చెడు అలవాట్లతో నాశనమవుతుంది. ఇక పిసినారి వాడు తన కోసం కానీ, ఇతరుల కోసం కానీ ధనం ఖర్చు చేయడు. పిసినారి వారు ఏ నాడు కూడా సంతోషంగా ఉండరు అని విదురుడు చెప్పుకొచ్చాడు.
Advertisement
లోబితో సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉండదు అని విధురుడు పేర్కొన్నాడు. అత్యాశ కలిగిన వ్యక్తులు తమ లాభం మాత్రమే చూసుకొని ఇతరుల మోసం చేయడానికి కూడా అసలు ఆలోచించరు. అనగా తన చిన్న ఆసక్తి కోసం ఆ వ్యక్తి ఇతరులకు చాలా హాని కలిగిస్తుంటారు. అటువంటి వారి ప్రతిష్ట ఎక్కువ రోజులు ఉండదు. వారి అతి తక్కువ సమయంలోనే నాశనానికి గురవుతారు. విదుర నీతి ప్రకారం.. అలాంటి వారి ప్రవర్తన గురించి ఇతరులకు తెలిసిన మరుక్షణమే వారిని పక్కన పెడుతుంటారు. ముఖ్యంగా అత్యాశపరులు, స్వార్థపరులను సమాజం ఏ నాడు మంచిగా చూడదు.
ఇది కూడా చదవండి : Vidura Niti : జీవితంలో విజయం సాధించాలంటే ఈ మూడింటిని వదిలేయండి..!