దేశవ్యాప్తంగా కొన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ గత పది సంవత్సరాల నుంచి చతికిల పడుతూ వస్తోంది.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ లో ఆధిపత్యపోరు అనేది ఎక్కువైపోయింది. పటిష్ట నాయకత్వం లేక పార్టీ రోజురోజుకు బలహీనమవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. పార్టీలో బడా లీడర్లు పార్టీని వీడడం, ఎప్పుడు ఎవరు బయటకు వెళ్ళిపోతారో చెప్పడం చాలా కష్టంగా మారింది. ఇటీవలే గులాబ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. రాహుల్ గాంధీపై అనేక ప్రశ్నలు సంధించిన ఆయన తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.
Advertisement
also read:
పార్టీ ఎందుకు ఆదరణ తగ్గుతుందో అనే విషయాన్ని రాహుల్‌గాంధీకి తెలియజేశారు. ఇలా రాహుల్ కు దగ్గరగా ఉన్నటువంటి ఆజాద్ పార్టీకి రాజీనామా ఎందుకు చేశారు అన్నది అసలు ప్రశ్న. దీనికి ప్రధాన కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి జమ్మూకాశ్మీర్‌లో పార్టీ వ్యవహారాల విషయమై ఆజాద్ సూచన ప్రకారమే నిర్ణయిస్తామని సోనియా గాంధీ హామీ ఇచ్చారు. కానీ కోపంతో ఉన్న ఆజాద్G-23 ద్వారా నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు . దీంతో ఆజాద్ కు తన సొంత రాష్ట్రంలో స్వేచ్ఛా హస్తం ఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆజాద్ నుంచి అధిష్టానం కొన్ని పేర్లను కోరింది. దీంతో ఆజాద్ సాంప్రదాయం ప్రకారం నాలుగు పేర్లను పంపించారు. ఇక రాష్ట్ర నేతలతో మాట్లాడిన రాహుల్.. వికర్ రసూల్ వనిని అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. దీంతో ఆజాద్ కోపం వచ్చింది.
Advertisement
నలుగురిలో తన సూచించిన పేరును కాకుండా వేరొకరిని ఎంపిక చేయడంతో అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే రసూల్ వనిని అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయించిన తర్వాత తనని ఢిల్లీకి పిలిపించారని కూడా ఆజాద్ చెప్పారు. అయితే అధిష్టానం ఆయన అధ్యక్షుడు గా ప్రకటించిన తర్వాత ఆజాద్ ను కలవ వద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆగ్రహించిన ఆజాద్ ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడానికి ఒప్పుకోలేదు. అలా కొన్ని రోజులు వేచి చూసిన ఆయన తన పదవులు అన్నింటికీ రాజీనామా చేశారు. తర్వాత ఇంచార్జ్ రజనీ పాటిల్ ఆయనతో మాట్లాడటానికి వాట్సాప్ చేశారు, దీనికి ప్రతిస్పందనగా ఆజాద్ రాజీనామాను పంపారు.. కాంగ్రెస్ అంచనా ప్రకారం 2019 నుంచి ఆజాద్ పార్టీని వీడాలని భావిస్తున్నట్టు సమాచారం అందుకుంది.
also read: