Telugu News » Blog » వినాయ‌క చ‌వితి రోజు చంద్రుడిని చూడ‌కూడ‌దు అంటారు ఎందుకో తెలుసా..?

వినాయ‌క చ‌వితి రోజు చంద్రుడిని చూడ‌కూడ‌దు అంటారు ఎందుకో తెలుసా..?

by Anji
Ads

సాధార‌ణంగా భార‌తీయుల ముఖ్య‌పండుగ‌లలో వినాయ‌క చ‌వితి ఒక‌టి అని చెప్పుకోవ‌చ్చు. వినాయ‌కుడిని ప్ర‌త్యేకంగా ఆరాధించే పండుగ‌ను కుల‌, మ‌తాల‌కు అతీతంగా ఘ‌నంగా జ‌రుపుకుంటారు. భాద్ర‌ప‌ద మాసంలోని శుక్ల ప‌క్ష చ‌తుర్థిన గ‌ణేష్ చ‌తుర్థి పండుగ జరుపుకుంటారు. పార్వ‌తి, ప‌ర‌మేశ్వ‌రుల కుమారుడు అయిన‌టువంటి వినాయ‌కుడి పుట్టిన రోజునే వినాయ‌క చ‌వితి జ‌రుపుకుంటుంటారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి  :  న‌రాల బ‌ల‌హీన‌త‌తో బాధ‌ప‌డే వారికి ‘సీతాఫ‌లం’ గొప్ప ఔష‌దం..!


ఇక పూర్వం గ‌జాసురుడ‌నే ఓ రాక్ష‌సుడుండేవారు. అత‌ను ప‌ర‌మ శివుడి కోసం త‌పస్సు చేస్తాడు. ఇందుకు ప్ర‌స‌న్న‌మైన శివుడు ఏ వ‌రం కావాలో కోరుకోమ‌ని అడ‌గ్గా.. ఆ రాక్ష‌సుడు నీవు ఎల్ల‌ప్పుడు నా ఉద‌రం నందే నివ‌సించాలంటాడు. శివుని అత‌ని కోరిక‌ను మ‌న్నించి గ‌జాసురుడి క‌డుపులో ప్ర‌వేశించి అత‌ని ఉద‌రంలో నివ‌సించ‌సాగాడు. ఈ విష‌యం తెలుసుకున్న పార్వ‌తీదేవి విష్ణువు వ‌ద్ద‌కు వెళ్లి నా భ‌ర్త‌ను భ‌స్మాసురుడి నుంచి కాపాడిన‌ట్టుగా గ‌జాసురుడి నుంచి ర‌క్షించ‌మ‌ని వేడుకుంటుంది. దీనికి ఉపాయం ఆలోచించిన విష్ణుమూర్తి దీనికి గంగిరెద్దు మేళ‌మే స‌రైద‌ని.. శివుడి ద్వార‌పాల‌కుడైన నందిని గంగిరెద్దుగా మార్చుతాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  RRR, KGF 2, కార్తికేయ 2 తో స‌హా బాలీవుడ్ లో ఎక్కువ వ‌సూళ్లు సాధించిన సినిమాలు ఇవే..!


బ్ర‌హ్మ‌దేవ‌త‌ల‌ను వివిధ వాయిద్యాకారులుగా మార్చి గ‌జాసురుడి పురానికి వెళ్లి నందిని ఆడించాడు. అందుకు త‌న్మ‌య‌త్వం చెందిన గ‌జాసురుడు ఏం కావాలో కోరుకొమ్మ‌ని అడుగుతాడు. మ‌హ‌న్నోత‌మైన గంగిరెద్దు, శివునికి వెతుక్కుంటూ వ‌చ్చింది. నీ ఉద‌రంలో ఉన్న శివుడిని ఇవ్వ‌మ‌ని కోర‌తారు. ఇక అది అడిగింది ఎవ‌రో కాదు.. సాక్షాత్తు మ‌హావిష్ణువేన‌ని తెలుసుకున్న గజాసురుడు త‌న‌కు ఇక మ‌ర‌ణం త‌థ్య‌మ‌ని గ్ర‌హిస్తాడు. శివునితో నా ముఖం లోకమంతా ఆరాధించేట‌ట్టుగా నా చ‌ర్మాన‌ని ధ‌రించాల‌ని కోర‌గా.. దీనికి శివుడు అంగీక‌రించిన‌ప్ప‌టికీ విష్ణువు సైగ‌తో నంది త‌న కొమ్ముల‌తో గ‌జాసురుడి క‌డుపును చీల్చి చంపేస్తుంది. ఇక అప్పుడు శివుడు బ‌య‌టికి వ‌చ్చి విష్ణువుని స్తుతిస్తాడు. దుష్టుల‌కు అడిగిన దానాల‌న్నీ చేయ‌కూడ‌ద‌ని శివుడితో చెబుతాడు విష్ణువు.


ప‌ర‌మేశ్వ‌రుడు కైలాసం వ‌స్తున్నాడ‌ని పార్వ‌తీదేవికి తెలుస్తోంది. దీంతో ఆ సంతోషంలో వంటికి న‌లుగు పెట్టుకొని స్నానం చేయ‌బోతు ఆ న‌లుగు పిండితో ఓ బొమ్మ‌ను త‌యారు చేసి ప్రాణం పోస్తుంది. ఆ బొమ్మ బాలుడిగా మారుతుంది. ఆ బాలుడిని ద్వారా వ‌ద్ద కాప‌లాగా ఉంచి త‌న అనుమ‌తి లేకుండా లోప‌లికి ఎవ్వ‌రూ కూడా రానివ్వ‌వ‌ద్ద‌ని చెబుతుంది. కాసేప‌టికే అక్క‌డికీ ప‌ర‌మ శివుడు చేరుకుని లోప‌లికి వెళ్తుండ‌గా ద్వారం వ‌ద్ద ఉన్న బాలుడు అడ్డుకుంటాడు. లోప‌లికి వెళ్లాలి అడ్డు తొల‌గ‌మ‌ని శివుడు చెప్ప‌గా.. త‌ల్లి ఆజ్ఞ మీర‌ని శివున్ని లోప‌లికి ప్ర‌వేశించ‌డు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు త‌న త్రిశూలంతో బాలుడి త‌ల న‌రుకుతాడు. ఇంత‌లోనే పార్వతి వ‌చ్చి త‌న బిడ్డ అలా ప‌డి ఉండ‌డం చూసి ఏడుస్తుంది. శివుడు అప్పుడు గ‌జాసురుడి త‌ల‌ను తీసుకొచ్చి బాలుడికి అతికించి ప్రాణం పోస్తాడు. ఇక అప్ప‌టి నుంచి వినాయ‌కుడిని గ‌జాననుడిగా పేరుపొందాడు.

Advertisement


కొద్ది రోజుల త‌రుఆత దేవ‌త‌లంద‌రూ ప‌ర‌మేశ్వ‌రుని వ‌ద్ద‌కు వెళ్లి త‌మ‌కు విఘ్నం రాకుండా ఉండేందుకు కొల‌వ‌డానికి ఓ దేవుడిని ప్రసాదించ‌మ‌ని కోరగా.. ఆ ప‌ద‌వీకి గ‌జాన‌నుడు, కుమార‌స్వామి ఇద్ద‌రూ పోటీ ప‌డుతారు. ముల్లోకాల్లోని పుణ్య న‌దుల‌న్నింటిలో స్నానం చేసి తిరిగి మొద‌ట వ‌చ్చిన వారే ఈ ప‌ద‌వీకి అర్హులు అని చెప్ప‌గా.. వెంట‌నే కుమార‌స్వామి నెమ‌లి వాహ‌నం ఎక్కి వెళ్లిపోయాడు. గ‌జాన‌నుడు మాత్రం నా బ‌ల‌బ‌లాలు తెలిసి మీరు ఈ ష‌ర‌తు విధించ‌డం స‌బ‌బేనా అని ప్ర‌శ్నించ‌గా.. తండ్రి అత‌నికి ఓ ఉపాయం చెబుతాడు. ఒక మంత్రాన్ని వివ‌రించి త‌ల్లిదండ్రుల చుట్టూ మూడు ప్ర‌ద‌క్షిణ‌లు చేసి దాన్ని ప‌ఠించ‌మ‌ని చెప్ప‌గా మంత్ర ప‌ఠ‌నం చేస్తూ వినాయ‌కుడు అక్క‌డే ఉంటాడు. ఈ మంత్ర ప్ర‌భావంతో కుమార‌స్వామి తాను వెళ్లిన ప్ర‌తీ చోట త‌న‌కంటే ముందుగా వినాయ‌కుడే స్నానం చేసి వెళ్తున్న‌ట్టుగా క‌నిపించింది. తిరిగి వ‌చ్చి తండ్రి అన్న మ‌హిమ తెలియ‌క ఏదో అన్నాను. న‌న్ను క్ష‌మించి అన్న‌కు ఆధిప‌త్యం అప్ప‌గించండి అని చెబుతాడు. భాద్ర‌ప‌ద శుద్ధ చ‌వితి రోజు గ‌జాన‌నుడు విఘ్నేశ్వ‌రుడు అయ్యాడు.

ఇక ఆ రోజు దేవ‌త‌లు, మునులంద‌రూ ర‌క‌ర‌కాల కుడుములు, పాలు, తేనే, అర‌టిప‌ళ్లు, పాన‌కం, వ‌డ‌ప‌ప్పు వంటివి స‌మ‌ర్పించారు. వాటిని తిన‌గ‌లిగిన‌న్ని తిని మిగిలిన‌వి తీసుకొని భుక్తాయాసంతో రాత్రి స‌మ‌యానికి కైలాసం చేరుకున్నాడు. త‌ల్లిదండ్రుల కాళ్ల‌కు న‌మ‌స్కారం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే క‌డుపు నేల‌కు ఆనుతుంది కానీ చేతులు మాత్రం ఆన‌డం లేదు. ఇది చూసి చంద్రుడు న‌వ్వ‌గా దిష్టి త‌గిలి పొట్ట ప‌గిలి వినాయ‌కుడు మ‌ర‌ణిస్తాడు. పార్వ‌తీదేవి ఆగ్ర‌హించి ఆరోజు చంద్రుడుని చూసిన వారంద‌రూ నీలాప‌నింద‌ల‌కు గుర‌వుతారు అని శాపం చేస్తుంది. చంద్రుడిని చూసిన రుషి ప‌త్నులు త‌మ భ‌ర్త‌ల ద‌గ్గ‌ర అప‌నింద‌ల‌కు గుర‌వుతారు. దేవ‌త‌లు, రుషులు ఈ విష‌యాన్ని శ్రీ‌మ‌హావిష్ణువుకి విన్న‌వించ‌గా.. ఆయ‌న అంతా తెలుసుకొని రుషుల‌కు త‌మ భార్య‌ల గురించి నిజం చెప్పి ఒప్పించ‌డంతో వినాయ‌కుడి పొట్ట‌ను పాముతో కుట్టించి ఆయ‌న‌కు అమ‌ర‌త్వాన్ని ప్ర‌సాదిస్తాడు. దేవ‌త‌లంద‌రి విన్న‌పం మేర‌కు పార్వ‌తి త‌న శాప‌విమోచ‌నాన్ని ప్ర‌క‌టిస్తుంది. ఇక ఏ రోజు అయితే చంద్రుడు నా కుమారుడిని చూసి న‌వ్వాడో ఆ రోజు మాత్రం అత‌న్ని చూడ‌కూడ‌ద‌ని చెబుతుంది. దేవ‌లంద‌రూ సంతోషిస్తారు. ఆ రోజే భాద్ర‌ప‌ద శుద్ధ‌చ‌వితిని మ‌నం వినాయ‌క‌చ‌వితిగా జ‌రుపుకుంటాం.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  గ‌ణ‌ప‌తి పూజా స‌మ‌యంలో పాల‌వెల్లి క‌ట్ట‌డానికి గ‌ల‌ కార‌ణం ఏంటో తెలుసా..?

 

You may also like