భారత డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్ తో పాటు 13 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొదట 11 మంది చనిపోయారు. ఆ తర్వాత తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మిగతా వారు కూడా కన్నుమూసారు. మరణించినవారిలో బిపిన్ రావత్ భార్య మధులికతో పాటు 9 మంది ప్రయాణికులు ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.
Advertisement
అయితే ఈ ఘోర ప్రమాదంను కళ్లారా చూసిన స్థానికుడు కృష్ణ స్వామి ప్రమాదం ఎలా జరిగిందో మీడియాకు వివరించారు…హెలికాప్టర్ కిందకి దిగడం చూశానని భయంకరమైన పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఒక చెట్టును ఢీకొట్టిందని దాంతో మంటలు చెలరేగాయని వివరించారు. హెలికాప్టర్ కింద పడకముందే పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది అని కృష్ణ స్వామి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో తన ఇల్లు ఉందని కృష్ణ స్వామి అన్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12 : 20 గంటలకు ఈ ప్రమాదం చేసుకుంది.
Advertisement
Also read :బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన చిత్తూరు జిల్లా యువకుడు…,!
అయితే తాను పరుగెత్తినపుడు పొగలు కమ్ముకొని మంటలు నిమిషాల్లో తన ఇంటి వరకు ఎగిసిపడ్డాయని కృష్ణస్వామి వెల్లడించారు. అదే ప్రాంతంలో నివసించే కుమార్ అనే యువకుడు పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారని తెలిపారు. అయితే అదే సమయంలో హెలికాప్టర్ నుండి ఎవరో కాలిపోవడం… పడిపోవడం చూశానని కృష్ణ స్వామి తెలిపారు. మరో ఇద్దరు ముగ్గురు కాలిపోయి కింద పడ్డారని కూడా కృష్ణ స్వామి చెప్పారు. అప్పుడు తాను భయపడ్డానని అన్నారు.
"I saw the helicopter coming down. There were terrible loud sounds… plumes of smoke and fire rising high after it hit the ground" An eyewitness describes crash of IAF chopper carrying senior defence officials including CDS Gen Bipin Rawat. pic.twitter.com/ZnpZ2JLGPl
— Bharathy Singaravel|பாரதி| بارتي (@KuthaliPu) December 8, 2021