Telugu News » Blog » బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన చిత్తూరు జిల్లా యువకుడు…,!

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన చిత్తూరు జిల్లా యువకుడు…,!

by AJAY
Ads

తమిళనాడులోని ఊటీ కొండల్లో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది మరణించారు. చనిపోయిన వారిలో బిపిన్ రావత్ భార్య ఆధునిక కూడా ఉన్నారు. అంతే కాకుండా బిపిన్ రావత్ కుటుంబ సభ్యులతో పాటు ఐదుగురు సిబ్బంది హెలికాప్టర్ లో ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం 14 మంది మరణించారు. అయితే మరణించినవారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వాసి కూడా ఉన్నారు.

Advertisement

Advertisement

Sai teja

Sai teja

Advertisement

చిత్తూరు జిల్లాలోని కురవ రగడ గ్రామం ఎరవగడ గ్రామానికి చెందిన లాన్స్ నాయక్ సాయి తేజ కూడా ఉన్నారు. సాయి తేజ చిత్తూరు వాసి కాగా రక్షణ శాఖలో లాన్స్ నాయక్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం బిపిన్ రావత్ కు సాయి తేజ వ్యక్తిగత భద్రతా సిబ్బంది గా ఉన్నారు. చిన్న వయసులోనే దేశ సేవ చేసేందుకు ఆర్మీ లో చేరిన సాయి తేజ మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంతే కాకుండా చిత్తూరు జిల్లా వాసులు సాయి తేజ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.