Home » మీ సెల్ ఫోన్ పోయిందా.. వెంటనే ఈ నెంబర్ కు మెసేజ్ పెట్టండి..ఎక్కడుందో తెలిసిపోతుంది..!!

మీ సెల్ ఫోన్ పోయిందా.. వెంటనే ఈ నెంబర్ కు మెసేజ్ పెట్టండి..ఎక్కడుందో తెలిసిపోతుంది..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఆహారం లేకుండా ఒక పూట బతుకుతామేమో కానీ సెల్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా బతికే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి సెల్ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది కేటుగాళ్లు మన చేతిలో ఉన్న సెల్ఫోన్లను ఇట్టే మాయం చేస్తారు.. అలాగే కొంతమంది సెల్ ఫోన్ ను బయట పోగొట్టుకుంటారు.. అలా కొన్ని వేల రూపాయలు పెట్టి కొన్న ఫోన్లు ఎవరైనా కొట్టేసిన లేక మిస్సయిన ఇక మనకి దొరకడం కష్టం.. ఈ తరుణంలో మీ ఫోన్ లో గూగుల్ అకౌంట్ కానీ లేదా ఆపిల్ అకౌంట్ కానీ ఉంటే సెల్ ఫోన్ ఆన్ లో ఉంటే ఫోన్ ఎక్కడ ఉందో కనిపెట్టే సౌకర్యం ఉంది అని మీకు తెలుసా.. ఒకవేళ మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే కనిపెట్టడం కాస్త కష్టమే కానీ.. అత్యాధునిక సాంకేతిక ట్రాకర్లతో దీన్ని కనిపెట్టగలం.. అయితే మొబైల్ ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ తప్పనిసరి కావాలి ..

Advertisement

also read:కాకరకాయ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

Advertisement

ఈ ప్రాసెస్ ద్వారా వెళ్తే పోలీసులు మన మొబైల్ ఎప్పుడు ట్రాక్ అయితే అప్పుడు మన చేతికి అందిస్తారు.. అయితే ఈ ప్రాసెస్ చాలా మందికి తెలుసు కానీ, ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదంటున్నారు అనంతపురం పోలీసులు.. సింపుల్ గా ఒక బోటు ద్వారా మీ సెల్ ఫోను వెతికి పెడతాం అంటున్నారు. మరి అది ఎలాగో ఒకసారి చూద్దాం.. మొబైల్ ట్రాక్ చేసే సిస్టమ్ ను అనంతపురం ఎస్.పి పకీరప్ప ఆధ్వర్యంలో కనిపెట్టారు.. అదెలా ఉపయోగించుకోవాలంటే .. మీ మొబైల్ పోగొట్టుకున్నవారు ఒకవేళ చోరీకి గురైనట్లు గుర్తించినవారు ముందుగా 9440796812 అనే నెంబర్ కు వాట్సాప్ ద్వారా ఆంగ్లంలో హాయ్ లేదా హెల్ప్ అని మెసేజ్ పెట్టాలి.. ఈ మెసేజ్ వారికి వెళ్లిన వెంటనే వెల్కమ్ టూ అనంతపురం పోలీస్ అనే లింకు తో ఒక మెసేజ్ వస్తుంది. ఈ లింక్ ని క్లిక్ చేయగానే అందులో గూగుల్ ఫార్మాట్ లో ఒక వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీ జిల్లా పేరు, మీ పేరు,వయసు, తండ్రి పేరు, మీ పూర్తి చిరునామా కాంటాక్ట్ నెంబర్, పోయిన ఫోన్ మోడల్, ఐఎంఈఐ నెంబర్ ఫోన్ ఎక్కడ మిస్ అయిందో ఆ ప్రాంత వివరాలు నమోదు చేయాలి.. ఆ వివరాలు నమోదు చేయగా సాంకేతిక బృందం మీ ఫిర్యాదును తీసుకొని, దాన్ని పర్యవేక్షించడానికి కార్యాలయంలో ఎనిమిది మందితో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందం పని మొదలు పెడుతుంది..

ఈ విధంగా చాట్ బోట్ ద్వారా మొబైల్ ఫోన్లో ఆచూకీ వస్తుండడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటుగా, కర్ణాటక,తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఫిర్యాదు వస్తున్నాయట.. ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీ వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి దాదాపు ఏడు వేల ఆరు వందలు, ఇతర జిల్లాల నుండి2857, ఇతర రాష్ట్రాల నుండి 202 వివరాలను పంపారు. ఇందులో ఇప్పటి వరకు 10660 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో 2100 మొబైల్ ఫోన్ లో ఆచూకీ కనుక్కొని బాధితులకు అందించారు. కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎక్స్ ప్రెస్ గ్రూప్ ఈ సేవలను గుర్తించి టెక్నాలజీ సభ 2022 అవార్డుకు ఎంపిక చేసింది.. ఏది ఏమైనా అనంతపురం పోలీసుల సహకారానికి హ్యాట్సాఫ్..

also read:సమంత పారితోషికం విషయంలో కొత్త కండిషన్స్.. అలా అయితే నా దగ్గరకు రండంటూ..!!

Visitors Are Also Reading