Home » జ‌బ‌ర్ద‌స్త్‌, శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో చేసే అన్న‌పూర్ణ‌మ్మ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

జ‌బ‌ర్ద‌స్త్‌, శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో చేసే అన్న‌పూర్ణ‌మ్మ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

by Anji
Ad

తెలుగులో బుల్లితెర‌పై ఫేమ‌స్ కామెడీ షో అంటే ఎవ‌రైనా జ‌బ‌ర్ద‌స్త్ అనే చెబుతుంటారు. ఈటీవీలో ప్ర‌సారమ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ షో గురించి తెలియ‌ని వారుండ‌రు. అదేవిధంగా జ‌బ‌ర్ద‌స్త్ తో శ్రీ‌దేవి డ్రామా కంపెనీ షో కూడా సంచ‌ల‌న విజ‌యం సాధించింద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఎంతో మంది క‌మెడీయ‌న్లు జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా వెలుగులోకి వ‌చ్చి ఇప్పుడు ప‌లు సినిమాల్లో న‌టిస్తున్నారు కూడా. ఈటీవీ అంటే అది ఒక బ్రాండ్ అనే చెప్ప‌వ‌చ్చు. ఈటీవీలో ప్ర‌తీ సీజ‌న్‌లో ఒకటి పాపులారిటీ ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ రెండు షోలు అంద‌రి దృష్టిని ఆక‌ర్శిస్తున్నాయి. ఇక అప్ప‌ట్లో కొన్ని స్పెష‌ల్ ఎపిసోడ్స్ కి సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వారు వ‌చ్చే వారు. కానీ ఇప్పుడు కొంద‌రూ ఇండ‌స్ట్రీ వారు రెగ్యుల‌ర్‌గా జ‌బ‌ర్ద‌స్త్‌లో త‌ప్ప‌క‌ క‌నిపిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి : ఈ సినిమాను వదులుకొని ఎన్టీఆర్ చాలా బాధపడ్డారట.. నవ్వుకున్న ఏఎన్ఆర్..!

Advertisement


ఇక వారిలో అన్న‌పూర్ణ‌మ్మ ఒక‌రు. ఈమె వ‌య‌స్సు మీద ప‌డుతున్న‌ప్ప‌టికీ చాలా యాక్టివ్‌గా త‌న‌మీద పంచ్‌లు వేయించుకుంటూ.. అదేవిధంగా ఎదుటివారిపై త‌న‌దైన స్టైల్‌లో పంచ్‌లు వేస్తూ శ్రీ‌దేవి డ్రామా కంపెనీ మ‌రియు జ‌బ‌ర్ద‌స్త్ షోల‌ను ర‌క్తిక‌ట్టిస్తోంది. ప్ర‌ధానంగా జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఈమె ఆటో రామ్ ప్ర‌సాద్ టీమ్‌లో మెయిన్ కంటెస్టెంట్ మారిపోయింది. రెగ్యుల‌ర్ గా ఆమెకు పాత్ర‌ను రామ్‌ప్ర‌సాద్ రాస్తున్నాడు. దీంతో ఆమె జ‌బ‌ర్ద‌స్త్ లో రెగ్య‌లర్ గా క‌నిపిస్తోంది. సినిమాల్లో కంటే ఎక్కువ‌గా ఈమె ఈ మ‌ధ్య జ‌బ‌ర్ద‌స్త్ ల క‌నిపిస్తోంది. ఈమె గ‌తంలో క‌న్నా ఇప్పుడు ఎక్కువ‌ గుర్తింపు సంపాదించుకుంటున్నారు.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  వినాయ‌క చ‌వితి రోజు ఈ 5 ప్ర‌సిద్ధి దేవాల‌యాల‌ను ద‌ర్శించుకుంటే అంతా శుభ‌మే..!


అన్న‌పూర్ణ‌మ్మ జ‌బ‌ర్ద‌స్త్ మ‌రియు శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో క‌నిపించినందుకు అన్న‌పూర్ణ‌మ్మ‌కు భారీగానే రెమ్యున‌రేష‌న్ మ‌ల్లెమాల వారు ఇస్తున్నార‌ట‌. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. ఒక్కో కాల్షీట్కి రూ.రెండున్న‌ర ల‌క్ష‌ల వ‌ర‌కు ఇస్త‌రాట‌. ఇది చాలా మంది క‌మెడీయ‌న్స్ కంటే ఎక్కువ అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ , శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో ఆమె జోరు కొన‌సాగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. భారీగా ఆమె పారితోషికం ద‌క్కించుకుని ఆమె వ‌ర్త్ కామెడీని పండిస్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక ఏదీ ఏమైనా అన్న‌పూర్ణ‌మ్మ పారితోష‌కం అధికంగానే తీసుకున్న‌ట్టు స‌మాచారం.

ఇవి కూడా చ‌ద‌వండి :  వినాయ‌క చ‌వితి రోజు ఈ 5 ప్ర‌సిద్ధి దేవాల‌యాల‌ను ద‌ర్శించుకుంటే అంతా శుభ‌మే..!

Visitors Are Also Reading