నగరాల్లో కాలుష్యం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసిన వాహనాల చప్పుడు వాటి నుండి వచ్చే పొగతో నిండిపోతుంది. అలాంటి వాతావరణంలో నగరాల్లోని ప్రజలకు పచ్చని చెట్టును చూస్తే చాలు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అందుకే ఎక్కడ పార్క్ ఉంటే అక్కడ సందడిగా కనిపిస్తుంది. ఇక కాస్త స్థలం ఉంటే భాగుండు ఓ చెట్టును పెంచుకునేవాళ్లం అని కూడా చాలా మంది అనుకుంటారు. మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ కు కూడా అలానే అనిపించిందో ఏమో తన ఇంటినే పచ్చదనం తో నింపేశారు. ఇంట్లో రకరకాల చెట్లను పెంచి వనంలా మార్చారు. దాంతో మధూ యాష్కీ గౌడ్ ఇంటికే ఓ ప్రత్యేకత వచ్చింది.
మధూయాష్కీ గౌడ్ కు మొక్కలంటే చెప్పలేనంత ఇష్టం. రోడ్డు పక్కన నర్సరీ కనిపించిందంటే చాలు కారు ఆపాల్సిందే…ఓ మొక్క కొనాల్సిందే. అలా ఎన్నో మొక్కలు తీసుకువచ్చి మధుయాష్కీ తన ఇంట్లో పెంచారు. మధు యాష్కీ ఇంట్లో ఒకేరకమైన మొక్కలు కాకుండా పండ్ల మొక్కలు..పూల మొక్కలతో పాటూ ఔషద మొక్కలు సైతం పెచడం ఆయన ప్రత్యేకత.
Advertisement
Advertisement
ఆరోగ్యం కోసం ఎక్కడెక్కడికో పరుగులు తీస్తారని….ఆహ్లాదకరమైన వాతావరణం కోసం దూర ప్రాంతాలకు వెళతారని అవే మొక్కలను మన ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యాన్ని కాపాడతాయని మధూయాష్కీ చెబుతున్నారు. ఇక ఎంతో పనిఒత్తిడిలోనూ మధూయాష్కీ మొక్కల గురించి పట్టించుకుంటారంటే మొక్కలపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు మొక్కల గురించి ఎవరైనా పట్టించుకుంటారు. కానీ మధుయాష్కీ భయటకు వెళ్లినప్పుడు చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా మొక్కల గురించి పట్టించుకుంటూ నీరు పోశారా అంటూ ఫోన్ చేస్తారట.