సినిమా అంటేనే మాయ. మనల్నీ ఎక్కడకో.. తీసుకెళ్లారని అనుకుంటాం.. కానీ మనం ఎక్కడికి వెళ్లం.. అక్కడే ఉంటాం. ఆ మ్యాజిక్కే గ్రాఫిక్స్. ఈ గ్రాఫిక్స్ ను ఇటీవల కాలం లో ప్రతి సినిమా గ్రాఫిక్స్ తో నే తీస్తున్నారు. దీని కోసమే భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఈ గ్రాఫిక్స్ వల్ల సినిమా లలో నటీ నటులు చంద్ర గ్రహాం మీద.. మంచు కొండల పైనా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ వారు చంద్ర గ్రహాం పోరు.. అలాగే మంచు కొండల పైనా ఉండరు. అది అంతా కూడా గ్రాఫిక్స్ మాయనే. అయితే గ్రాఫిక్స్ సన్నివేశాలు షూటింగ్ సమయం లో వెనక గ్రీన్ మ్యాట్ ఉంటుంది.
Also Read: రావణుడి మరణం తర్వాత భార్య మండోదరి ఎలా స్పందించిదో తెలుసా?
Advertisement
Advertisement
ఈ గ్రీన్ మ్యాట్ ను ఎందుకు ఉంచుతారో చాలా మంది కి తెలియదు. ఈ గ్రీన్ మ్యాట్ ఉండటం వల్లనే ఈ చంద్ర మండలాలు.. మంచు కొండలు సినిమా లలో కనిపిస్తాయి. అయితే షూటింగ్ సమయం లో గ్రీన్ మ్యాట్ మాత్రమే ఎందుకు ఉంచుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. షూటింగ్ సమయంలో బ్యాక్ గ్రౌండ్ షూటింగ్ స్క్రిన్ లో కనిపించ కుండా ఉండటానికి గ్రీన్ మ్యాట్ కడుతారు. తర్వాత వీడియో ను ఎడిట్ చేసే సమయం లో గ్రీన్ కలర్ మొత్తాన్ని డిలీట్ చేస్తారు.
దీంతో బ్యాక్ గ్రౌండ్ లో .. చంద్ర మండలం కానీ.. మంచు కొండలు కానీ ఇంకా ఎదైనా ఉంచు తారు. అప్పుడు నటీ నటుటు నిజాంగానే చంద్ర మండలం పై నే ఉన్నారని మనకు సినిమా లలో కనిపిస్తుంది. అయితే ఈ గ్రీన్ అనే కలర్ మానవ శరీరం లో బాడీ కి గానీ, వెంట్రుకలకు గానీ ఇతర అవయావలకు గానీ మ్యాచ్ కాదు. ఎడిటింగ్ లో ఈ ఒక్క కలర్ ను మాత్రమే డిలిట్ చేస్తే ఏ ఇతర భాగాలు మిస్ కావు. అందు చేతనే గ్రాఫిక్స్ సన్నివేశాల ను షూటింగ్ చేసే సమయంలో గ్రీన్ మ్యాట్ ను ఉపయోగిస్తారు.
Also Read: RRR : “ఆర్ఆర్ఆర్” నుంచి మరో అప్డేట్.. భీమ్ ప్రోమో రిలీజ్