దేశంలోనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరును మార్చబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదన చేసింది. దేశంలో ఢిల్లీలో ఎయిమ్స్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అన్ని ఎయిమ్స్ మెడికల్ కళాశాలల పేర్లను మార్చనున్నది.
Advertisement
పలు ప్రాంతాల్లోని ప్రాంతాల వీరులు, స్వాతంత్య్ర సమరయోదులు, చారిత్రక సంఘటనలు, స్మారక చిహ్నాలు, ప్రత్యేక భౌ గోళిక గుర్తింపుల పేర్లతో ఎయిమ్స్ కి నామకరణం చేయనున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎయిమ్స్‌లకు నిర్ధిష్ట పేర్లను ఇవ్వడానికి ఒక ప్రాతిపదికన రూపొందించింది. ఎయిమ్స్ ను మూగు రకాలుగా వర్గీకరించారు. నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్ అనే మూడు రకాలుగా వర్గీకరించినట్టు తెలుస్తోంది.
Advertisement
దేశంలో కొత్తగా 6 ఎయిమ్స్ బీహార్ (పాట్నా) ఛత్తీస్ గఢ్ (రాయ్‌పూర్), మధ్య ప్రదేశ్ (భోపాల్), ఒడిశా (భువనేశ్వర్) రాజస్థాన్ (జోద్పూర్), ఉత్తరాఖండ్ (రిషికేశ్) ప్రధాని సురక్ష యోజన ఫేజ్-1 ఆమోదించబడ్డాయి. ఇవి పూర్తిగా పని చేస్తున్నాయి. 2015-2022 మధ్య ప్రారంభమైన 16 ఎయిమ్స్ లో 10 ఇన్స్టిట్యూట్ లలో ఎంబీబీఎస్ తరగతులు, ఔట్ పేషెంట్ డిపార్టుమెంట్ సేవలను ప్రారంభించగా మరో రెండింటిలో ఎంబీబీఎస్ తరగతులు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగిలిన నాలుగు నిర్మాణంలోనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి : ప్రతి రోజూ లెమన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?