ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే అది మామూలు విషయం అయితే కాదు. నటన, అందం, టాలెంట్ దానికి తోడు అభినయం, ఓపిక ఇలా అనేకం ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకొగలరు. అవకాశం వచ్చింది అంటే దాన్ని చాలా తెలివిగా వాడుకొవాలి, మరోవైపు అదృష్టం కూడా కలిసి రావాలి.
Advertisement
వీటికి తోడుగా వారు నటించిన సినిమాలు కూడా సక్సెస్ కావాలి. ఇన్ని ఇబ్బందులు దాటితే ఒక హీరోయిన్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది. అందం, అదృష్టం, టాలెంట్ ఈ మూడు క్వాలిటీస్ ఉన్నా కానీ ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయింది. ఇంతకీ హీరోయిన్ ఎవరయ్యా అంటే కలర్స్ స్వాతి.
ALSO READ:ఎన్టీఆర్ “నర్తనశాల” సినిమా కోసం తీసుకున్న నిర్ణయాన్ని చూసి నిర్మాతలు సైతం కంగు తిన్నారు !
ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. బుల్లితెర రంగంలో కలర్స్ పోగ్రామ్ తో ఎంట్రీ ఇచ్చి, మంచి క్రేజ్ సంపాదించుకుంది. అష్టాచమ్మా మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె చేసిన మొదటి సినిమాతోనే హీరోయిన్ గా ఫిలింఫేర్ అవార్డ్, నంది అవార్డ్ ని సొంతం చేసుకుంది. మొదటి సినిమానే ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిందంటే ఆ హీరోయిన్ కు తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు. ఇక చేతినిండా అవకాశాలు స్టార్ హీరోయిన్ అయినట్లే అనుకుంటాం కానీ కలర్ స్వాతి జీవితంలో మాత్రం అలా కాలేదు. ఆ తర్వాత గోల్కొండ హై స్కూల్, కార్తికేయ, స్వామిరారా వంటి మూవీస్ లో నటించిన కానీ అంతగా ఆకట్టుకోలేదు. దీనికి ప్రధాన కారణం స్వాతియెనట.
Advertisement
హీరోయిన్ గా రాణిస్తున్న రోజుల్లో ఎన్నో ఆఫర్స్ వచ్చినా చేతికి వచ్చిన వాటిని రిజెక్ట్ చేసిందట. అంతేకాకుండా తన అందం మీద సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, మొదటి సినిమాతో పోల్చుకుంటే రానురాను స్వాతి గ్లామర్ లో ఎన్నో మార్పులు వచ్చాయని అంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటేనే ప్రముఖంగా గ్లామర్ చూస్తారు. హీరోయిన్ ను చూసేది అందం కోసం, అలాంటి హీరోయిన్లు తమ అందాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లు అందం అనే ఫార్ములాను పాటిస్తూ ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.. కానీ కలర్స్ స్వాతి మాత్రం దాన్ని మర్చిపోయింది.. దీంతో ఆమె తన గ్లామర్ పై కేర్ తీసుకోకపోవడంతో ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గి చివరికి ఇండస్ట్రీనే విడిచి వెళ్లి వివాహం చేసుకొని సెట్ అయిపోయింది కలర్స్ స్వాతి.
ALSO READ: