దేశంలో థర్డ్ వేవ్ రాబోతుందని మరోసారి వార్నింగ్ వచ్చింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒమిక్రాన్ కారణంగా ఇండియాలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. ఈ వేరియంట్ కారణంగా ఇప్పటికే దేశంలోని కీలక రాష్ట్రాల్లో కేసులు రెండంకెలకు చేరుకున్నాయని పేర్కొంది. రాబోయే రోజుల్లో భారీస్థాయిలో కేసులు వచ్చే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. అంతే కాకుండా ఇప్పటి హెల్త్ వర్కర్ లకు అదనపు డోస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. మరోవైపు 18 నుండి 12 ఏళ్ల మధ్య వయసు గల వారికి కూడా వ్యాక్సిన్ లు వేయాలని కేంద్రానికి సూచించింది.
కరోనా నుండి వ్యాక్సిన్ రక్షణ ఇస్తుందని ఇప్పటికే రుజువైందని చెప్పింది. దేశంలో ఇప్పటి వరకూ యాబై శాతం మందికి పైగా రెండో కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేసుకున్నారని చెప్పింది. వ్యాక్సినేషన్ పై దృష్టి పెడితే మనం థర్డ్ వేవ్ ప్రమాదం ను ఎదుర్కోవచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని వ్యాక్సిన్ వేసుకోని వారిపై దృష్టి పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసిషన్ ఆదేశించింది.
Advertisement
Advertisement
also read : మోసపోయిన బిగ్ బాస్ బ్యూటీ…డబ్బు, నగలతో ప్రియుడు జంప్..!
అంతే కాకుండా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి కూడా మూడో డోసు వ్యాక్సిన్ లు ఇవ్వాలని సూచించింది. ఒమిక్రాన్ వల్ల ఇన్షెక్షన్ అంతగా ఉండదని కానీ ఇది డెల్టా కంటే ఐదు నుండి పది రెట్లు వేగంగా విస్తరింస్తుందని పేర్కొంది. కాబట్టి ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించింది. ట్రావెన్ బ్యాన్ విధించాలని తాము చెప్పడం లేదని….కానీ అనవసర ప్రయాణాలు మాత్రం పెట్టుకోవద్దని తెలిపింది. పెద్ద ఎత్తున గుమ్మిగూడవద్దని…ప్రోటోకాల్ పాటించాలని సూచించిందిజ.