ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మందుబాబులే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. చాలా మందికి రాత్రి వేళ మందు తాగకపోతే అసలు నిద్రనే పట్టదు. ఈ మద్యం ఆరోగ్యానికి ఎంతో చెడు చేస్తుందని తెలిసి కూడా దీనిని తాగకుండా ఉండరు. అదేవిధంగా మద్యానికి బానిసలుగా మారి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మద్యం గురించి వైద్య నిపుణులు కూడా పలుమార్లు హెచ్చరించినప్పటికీ మందుబాబుల్లో మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం. అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడం చాలా మంచిది అని అంటున్నారు వైద్య నిపుణులు.
కొన్ని వ్యాధులకు సంబంధించి ఇంగ్లీషు మందులను వాడుతుంటారు. అలాంటి మందుల్లో యాంటిబయోటిక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. యాంటి బయోటిక్ తీసుకున్నప్పుడు ఈ ఆల్కహాల్‌ను తీసుకోవడం చాలా ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. మద్యం నిత్యం తీసుకోవడం వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడడం ఖాయమని చెబుతుంటారు. ప్రత్యేకంగా యాంటిబయోటిక్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు మద్యం సేవించవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఈ యాంటి బయోటిక్ టాబ్లెట్లు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
టినిడాజోల్ :
Advertisement
ఈ యాంటి బయాటిక్ టాబ్లెట్. ముఖ్యంగా ఇది పేగుకు సంబంధించిన వ్యాధులకు కొన్ని ఇన్ఫెక్షన్లకు సహాయపడుతుంది. ఈ టాబ్లెట్ తీసుకోవడం ద్వారా మద్యం సేవించినట్టయితే రక్తపోటులు, హెచ్చుతగ్గుదల, ఊపిరి ఆడకపోవడం, వాంతులు, వికారం, తలనొప్పి వంటి ఇబ్బందులకు గురవుతారు.
మెట్రో నిడాజోల్ :
ఇక ఈ టాబ్లెట్లను ఎక్కువగా దంత సంబంధించిన వ్యాధులకు, రొసేసియా, కాలేయంలో జోరబడిన బ్యాక్టీరియాలను సంహరించేందుకు సహాయపడుతుంది. ఈ టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకున్నట్టయితే తలనొప్పి వికారం కడుపునొప్పి, వాంతులు లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా సెపోటేటన్, స్వల్ప మేథో క్సజోన్, లినేజోలిడ్ అనే యాంటీ బయాటిక్స్ వేసుకున్నప్పుడు ఈ ఆల్కహాల్ ని తీసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. అందుకే ఆల్కహాల్ కి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read :
మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మటుమాయం
అమీర్‌ఖాన్ సినిమాకి ఆ స్టార్ క్రికెటర్ల రివ్యూ.. ఎలా ఉందంటే..?